NTV Telugu Site icon

Piyush Goyal: తెలంగాణలో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుంది.. రాహుల్‌ ఎప్పటికీ ప్రధాని కాలేరు..

Piyush Goyal

Piyush Goyal

Union Minister Piyush Goyal: బీజేపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఉదయం 11.15 గంటలకు రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీయూష్ గోయల్.. ఎంపీ, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్​, తదితరులు హాజరయ్యారు. సంగారెడ్డిలో జహీరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ నామినేషన్ కార్యక్రమంలో కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పాల్గొన్నారు.

Read Also: Telangana: ఏనుగుల మందను ఎదుర్కొనేందుకు అటవీశాఖ సన్నద్ధం: పీసీసీఎఫ్

కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రాజీవ్ గాంధీ 100 రూపాయలు ఇస్తే దళారులు 85 రూపాయలు తిని 15 రూపాయలు మాత్రమే పేదలకు అందేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎప్పటికి ప్రధాని కాలేరని ఆయన అన్నారు. కరప్షన్, కుటుంబ పాలనకి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని.. తెలంగాణలో అవినీతి బీఆర్‌ఎస్ సర్కార్ పని అయిపోయిందన్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందన్నారు. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ప్రధాని అవ్వొచ్చన్నారు. దేశంలో పేదరిక నిర్ములన కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.