Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్.. ఎన్టీఆర్ జిల్లా అధికారులపై సీరియస్ అయ్యారు.. కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా ఎ.కొండూరులో తాగునీటి సరఫరా గురించి లంబాడి తండా వాసులతో మాట్లాడారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీప్రవీణ్ పవార్… అయితే, తమకు రెండు రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తున్నాయంటూ కేంద్రమంత్రి ఎదుట వాపోయారు తండావాసులు.. ఇక, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారిని వివరణ కోరగా.. తాగునీటికి ఇబ్బంది లేదని అనడంతో కేంద్ర మంత్రి సీరియస్ అయ్యారు.. అసత్యాలు ఎలా చెబుతారని అధికారిపై తీవ్రస్వరంతో కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, కేంద్రమంత్రి సీరియస్ కావడంతో ఖంగుతిన్నారు అధికారులు.. నీరు వస్తుంటే ఇక్కడి వారు రావటం లేదని చెబుతారా? అని అధికారులను నిలదీశారు భారతీప్రవీణ్ పవార్.. సక్రమంగా విధులు నిర్వర్తించాలని, ఇబ్బంది ఉంటే చెప్పాలి తప్ప అసత్యాలు సరికాదని హితవుపలికారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్.
Read Also: Kerala High Court: నగ్నత్వాన్ని అశ్లీలతతో ముడిపెట్టకండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు
కాగా, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు గ్రామంలో పర్యటించిన కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్.. స్థానిక పీ.హెచ్.సీని పరిశీలించారు.. ఆసుపత్రి సిబ్బందిని అడిగి పనితీరు, వివరాలు తెలుసుకున్న ఆమె.. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన లబ్థిదారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.. అర్హులైన ప్రతీ ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న లబ్దిని పొందేలా కృషి చేయాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.. కాగా, జిల్లా అధికారులపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.