union minister nirmala sitharaman react on brs.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చుతున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ తో టీఆర్‌ఎస్ ఆవిర్భవించిందన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే మూడు నినాదాలతో టీఆర్‌ఎస్ ముందుకి వెళ్లింది. కుల రహిత సమాజం నిర్మించడమే టీఆర్‌ఎస్ లక్ష్యం అన్నారు. 2014 నుంచి 2018 వరకు మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు.. రెండో సారి అధికారంలోకి వచ్చాక తొలుత మహిళలకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ప్రతి పక్షాలు మీడియా ప్రశ్నించడంతో మహిళలకు మంత్రి వర్గంలో చోటు దక్కింది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు… టీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణకు 3లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ప్రజలపై భారం మోపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లక్షల కోట్లు ఖర్చు చేసారు కానీ చుక్క నీరు రాలేదు. నియామకాలన్న కేసీఆర్ రాష్ట్రంలో ఎందుకు ఉద్యోగాల భర్తీ జరపట్లేదు. టీఆర్‌ఎస్ సర్కారు నీళ్ళు, నిధులు, నియామకాలు కల్పించడంలో పూర్తీగా విఫలం. మహిళలను మంత్రి వర్గంలో పెట్టుకుంటే మంచిది కాదని తాంత్రికుడు చెప్పడంతో మహిళలకు అవకాశం కల్పించలేదు.. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. మంత్రాలు, తంత్రాలు అనే నెపంతో కేసిఆర్ సచివాలయానికి వెళ్లలేదు. తెలుగు, తెలంగాణను మర్చిపోతున్నా టీఆర్‌ఎస్ దేశానికి ఏం చేస్తుంది. తెలంగాణను అభివృద్ది చేయని కేసిఆర్ దేశాన్ని అభివృద్ది చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
