Site icon NTV Telugu

Kishan Reddy: ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు..

Union Minister Kishan Reddy

Union Minister Kishan Reddy

Kishan Reddy: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం సాధించిన విషయాలను బీఆర్ఎస్ చెప్పుకోవాలన్నారు. అబద్ధాలు చెప్పటం, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించటం టార్గెట్‌గా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రతిరోజూ, ప్రతి గంట, ప్రతి నిమిషం మోడీని విమర్శించకుండా పూట గడవడం లేదన్నారు. ఆత్మస్తుతి, పర నింద అన్నట్లుగా తెలంగాణ బడ్జెట్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్ తెలంగాణ ప్రజల కోసం పెట్టారా.. లేఖ కేంద్రాన్ని విమర్శించేందుకు పెట్టారా అర్థం కావటం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పతకాలు అటకెక్కాయన్నారు. తమ వైపల్యాలను కేంద్రంపై రుద్దుతున్నారన్నారు. సీఎం చదివిన వేలాది పుస్తకాల పరిజ్ఞానాన్ని బడ్జెట్‌లో పెట్టరు.. కానీ మోడీని తిట్టేందుకు ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. బడ్జెట్‌లో సాహిత్యం ఎక్కువ, సమాచారం తక్కువ, కుటుంబ సందేశం మాత్రమే ఉందన్నారు. గతంలో కేటాయించిన నిధులు ఖర్చు పెట్టలేదని మంత్రి ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం సహకరించటం లేదని, మోడీ పథకాలు బాగా లేవని విమర్శలు చేస్తున్నారని, దేశానికి కేసీఆర్ దిక్కు అన్నట్లుగా చెప్తున్నారన్నారు. దళితులకు ఇస్తానన్న కుర్చీలో కేసీఆర్ కూర్చున్నారని మంత్రి వెల్లడించారు. కేసీఆర్ విదేశాల నుంచి తెచ్చుకున్న క్యాపులు పెట్టుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం అహంకారంతో మాట్లాడుతోందని.. 1200 మంది చనిపోయింది కల్వకుంట్ల కుటుంబం కోసం కాదన్నారు.

Revanth Reddy: వైఎస్సార్ సెంటిమెంట్‌ లాగానే.. సీతక్క నియోజకవర్గం నుంచే యాత్ర ప్రారంభించా..

కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లను కల్వకుంట్ల కుటుంబం జాతి రత్నాలుగా మార్చుకుందని ఆయన విమర్శించారు. తెలంగాణలో దర్యాప్తు సరిగ్గా జరగదని న్యాయస్థానం నమ్మిందన్నారు. దర్శకత్వం మీదే, విమర్శలు మీవే అంటూ.. రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి లెంప కాయలు వేసిందన్నారు. పారదర్శకతతో కూడిన దర్యాప్తు జరగాలని బీజేపీ కోరుకుంటుందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏంటో, రాష్ట్ర ప్రభుత్వం ఏంటో ప్రజలు గమనిస్తున్నారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Exit mobile version