NTV Telugu Site icon

Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నది

Kishan Reddy

Kishan Reddy

హైదరాబాద్ అంబర్ పేటలో సేవ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్​ కాలేజీ వద్ద ఇప్పటికే డైనమిక్​ లైటింగ్​ సిస్టమ్​ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, ఆర్ట్స్​ కాలేజీ చరిత్ర తెలిసేలా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లైటింగ్​ అండ్​ సౌండ్​ సిస్టమ్​ పెట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే సుమారు 14 కోట్ల రూపాయలతో క్రీడలను మెరుగుపరిచేందుకు, ట్రాక్ ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. ఇటీవల ఓయూలో రెండు హాస్టళ్ల భవనాల కోసం కేంద్రం రూ.15 కోట్లు మొదటి దశ మంజూరు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భవనాల నిర్మాణ కోసం నిధులు మంజూరు చేసిందన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్​ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Muthireddy Yadagiri Reddy: ఆర్టీసీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా

మన దేశంలో కరోనా వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం అనేక చర్యలు తీసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. మన రాష్ట్రంలో ఈఎస్​ఐ హాస్పిటళ్లలో అనేక వసతులు పెంచిందని.. మెడికల్​ కాలేజీలో 50 శాతం సీట్లు కార్మికుల పిల్లలకు కేటాయించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా.. గాంధీ, ఉస్మానియా, రైల్వే హాస్పిటల్​లో వసతులు మెరుగుపరిచిందని చెప్పారు. ప్రైమరీ సెంటర్లతో పాటు బస్తీ దవాఖానల కోసం, మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఇచ్చిందని తెలియజేశారు.

World Cup 2023: సచిన్‌ రికార్డు బద్దలు.. ప్రపంచకప్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా డేవిడ్‌ వార్నర్‌!

ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం సిటీకి మూడు వైపులా హాస్పిటల్స్​ కడుతామని హామీ ఇచ్చిందని.. కొత్త హాస్పిటళ్ల సంగతి అటుంచితే.. ఉస్మానియా హాస్పిటల్ ​లో కనీస వసతులు లేవని కిషన్ రెడ్డి తెలిపారు. వర్షం వస్తే మూసీ నీరు హాస్పిటల్​ లోపలికి వస్తుందని.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ ​ను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు వైద్య సాయం అందించే విషయంలో కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ఆయుష్మాన్​ భారత్​ కింద నచ్చిన హాస్పిటల్​లో పేదలు చికిత్స చేయించుకునే అవకాశం ఏర్పడిందని తెలిపారు. తెలంగాణలో ఆయుష్మాన్​ కార్డు అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్​ చేస్తున్నామన్నారు. ఈరోజు హైదరాబాద్ లో సేవా భారతి ఆధ్వర్యంలో నాలుగు మెగా మెడికల్​ క్యాంపులు పెట్టి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు, చికిత్సలు అందిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.