NTV Telugu Site icon

Union Minister Kishan Reddy: వేగంగా రైల్వేల అభివృద్ధి.. 2.94 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాం..

Kishan Reddy

Kishan Reddy

Union Minister Kishan Reddy: ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. విజయవాడలోని రైల్వే ఆడిటోరియంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. గూడ్స్ రవాణా నుంచి ప్యాసింజర్ ట్రైన్లు అభివృద్ధి చేశాం.. 53 శాతం రాయితీతో రైల్వే సేవలందిస్తోందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చాలా వేగంగా రైల్వే అభివృద్ధి చెందింది.. స్విట్జర్లాండ్ తో సమానంగా నెట్వర్క్ అభివృద్ధి చేశాం.. 2004లో కాంగ్రెస్ హయాంలో రైల్వే బడ్జెట్‌ రూ.8000 కోట్ల నుంచి రూ. 29 వేల కోట్లకు పెరిగింది.. మోడీ ప్రభుత్వంలో బడ్జెట్‌ రూ.2.8 లక్షల కోట్ల చేరిందన్నారు. రోజుకు 16 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ పెరుగుతోంది.. 5750 కిలోమీటర్ల ట్రాక్ లు, బ్రాడ్ గేజ్ లుగా అభివృద్ధి చేశాం.. రైల్వే లైన్ల విద్యుదీకరణకు రూ.38,650 కోట్లు ఖర్చు పెట్టాం అన్నారు. 26296 కొత్తగా 231 డబ్లింగ్ లైన్లకు రూ.2.7 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేశాం.. అమృత్ భారత్ ద్వారా 1309 రైల్వేస్టేషన్ లు మోడరన్ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.

Read Also: Passenger Poops on Flight : సీట్లోనే పనికానిచ్చేసిన ప్రయాణికుడు.. విమానమంతా గబ్బు గబ్బు

508 రైల్వేస్టేషన్ లు అభివృద్ధికి ప్రధాని మోడీ ఒకే రోజు భూమి పూజ చేశారు.. 41 వందే భారత్ ట్రైన్లు, స్వదేశీ టెక్నాలజీతో సెమీ హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు కిషన్‌రెడ్డి. ఇక, 2.94 లక్షల కొత్త ఉద్యోగాలు రైల్వేలో కల్పించామని తెలిపారు. 100 మీటర్ల పొడవైన స్క్రీన్ తో అతిపెద్ద ఆపరేషనల్ కమాండ్ సెంటర్ పని చేస్తోంది.. రెండు ఫ్రైట్ కారిడార్లు.. లుథియానా నుంచీ బీహార్ సోన్ నగర్ వరకు, ముంబై జవహర్ లాల్ నెహ్రూ పోర్టు నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని దాద్రి వరకూ ఉంటాయన్నారు. నిధుల అంశం పట్టించుకోకుండా RUB, ROBలు నిర్మాణం చేశాం.. జమ్మూకాశ్మీర్ లో చినాబ్ నది మీద ఐఫిల్ టవర్ కంటే అత్యంత ఎతైన పిల్లర్ల మీద వెళ్ళే రైల్వే బ్రిడ్జి నిర్మించాం అని వెల్లడించారు. విశాఖ నుంచి అరకు వరకూ విస్టాడాం కోచ్ లను ఏర్పాటు చేస్తున్నాం.. 6100 రైల్వేస్టేషన్ లలో ఫ్రీ హైస్పీడ్ వైఫై ఇచ్చామని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.