NTV Telugu Site icon

Kishan Reddy : ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

Kishan Reddy

Kishan Reddy

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే.. నేడు 2 గంటల 15 నిమిషాలు పాటు చార్మినార్ నుండి జంట నగరాలలోని పలు ప్రాంతాల గుండా అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ బైక్ ర్యాలీ లో వందలాది మహిళలు పాల్గొన్నారు. కాషాయ వస్త్రాలు, కాషాయ పగిడి ధరించి.. జాతీయ జెండాలతో ర్యాలీలో మహిళలు పాల్గొన్నారు. ర్యాలీనీ ప్రారంభించి చివరి వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఊరేగింపులో పాల్గొన్నందుకు మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొనడం… మీకు ఇదే మొదటి సారి కావొచ్చు… బైక్ నడిపి చేతులు నొప్పి పెట్టీ ఉంటాయని కిషన్‌రెడ్డి మహిళలను ఉద్దేశించా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. నిజాంను లొంగదీసుకోని అనాడు హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారని గుర్తు చేశారు.

74 ఏళ్ల తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా తిరిగి నగరం నడిబొడ్డున జాతీయ పతాకాన్ని ఎగర వేయనున్నారని, సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఎగవేయాలన్నారు. బురుజులు ఉన్న గ్రామాలపై జాతీయ పతాకం ఎగర వేయాలని, హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అయ్యి 74 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. ఇందులో భాగంగా ఏడాది పాటు విమోచన దినోత్సవ వేడుకలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, అజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలుగు వారైన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, ఘంటశాల, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందన్నారు. అజాది కా అమృత్ మహోత్సవాల్లో వలే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఏడాది పొడవునా తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

 

Show comments