NTV Telugu Site icon

Kishan Reddy : ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మోడీ వైపు చూస్తున్నారు..

Kishan Reddy

Kishan Reddy

హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి బుపెంద్ర భాయ్ పాటిల్ కి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏప్రిల్ మొదటి వారం లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరైతే దేశాన్ని ముందుకు తీసుకుపోతుందో.. ఎవరి నేతృత్వంలో అవినీతి రహిత దేశం ఏర్పడుతుందో ఆలోచించి ఓటు వేయాలని ప్రజల్ని కోరుతున్నానన్నారు. ప్రజలకు తెలుసు 2014 లో మోడీ ప్రధానిగా ఎన్నికయ్యాడన్నారు. అప్పటి నుండి దేశం ఎలా ముందుకు పోతుందో ప్రజలకు తెలుసునన్నారు. అంతకు ముందు యూపీఏ ప్రధాని ఉన్నపుడు పరిస్థితి ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ‘ఆ పార్టీ పెద్దలు ఎక్కడ సంతకం పెట్టమంటే పెట్టేవాడు… అప్పుడే దేశ ప్రజలు డిసైడ్ అయ్యారు.. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని మోది నీ ప్రధాని నీ చేశారు.. ఒక్క అవినీతి మచ్చ లేకుండా పరిపాలన చేసిన ఘనత మోడీ ది.. ప్రపంచ వ్యాప్తంగా సమర్థవంతమైన ప్రధాని ఎవరని సర్వే చేస్తే మోది పేరే ముందు వస్తుంది.. ప్రపంచ వ్యాప్తం గా ఎందరో మోడీ వైపు చూస్తున్నారు.. కేసీఆర్ పై విరక్తి చెందిన తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌నీ ఓడించారు.. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్ ఒక్క సీట్ గెలిచినా ఉపయోగం లేదు.. అతి త్వరలో రాష్ట్రంలో బీఅర్ఎస్ కనుమరుగు కానుంది. ప్రజలను మభ్యపెట్టే హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. అధికారం చేపట్టాక కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలుకు సాధ్యం అని చెబుతున్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ దేశంలో అధికారం లోకి రాదు..
అసలు రాహుల్ గాంధీ ఇప్పుడు కాదు ఎప్పటికీ ప్రధాని కాలేదు.. మళ్ళీ గెలిచేది బీజేపీనే.. ప్రధాని కూడా నరేంద్ర మోడీ నే.. మోది నీ గెలిపించుకోవాలని భాధ్యత మనపైనే ఉంది.. అసదుద్దీన్ ఓవైసీ నీ కూడా విధించాలి..’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.