Kinjarapu Ram Mohan Naidu: స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని కెపిహెచ్బి కాలనీ లోని పార్క్ లో చెత్తను శుభ్రపరిచారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రమగా ఉంటే మనసు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం 10 సంవత్సరాలు క్రితం మోడీ గారు ప్రాంభించారు. శ్రీకాకుళం స్వచ్ఛభారత్ లో టాప్ 10 లో ఉంచాలని లక్ష్యం పెట్టుకోవాలి., అంత పెద్ద వరద వచ్చిన తరువాత 10 రోజుల్లో నార్మల్ స్థితికి తీసుకురావడం కేవలం నారా చంద్రబాబు వలనే అవుతుంది అని నిరూపించారని ఆయన అన్నారు. విజయవాడ వరదల్లో సామాన్యుడులా భరోసా ఇస్తూ తిరిగారు. ప్రభుత్వం ఇంత కష్టపడి చేస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రజలకు బయబ్రాంతులకు గురిచేసి రాజకీయం చేస్తున్నాయి. ఎన్ని రాజకీయాలు చేసిన వాళ్ళ పప్పులు ఎక్కడ ఉడకడం లేదు. కాబట్టి సహించుకోలేకపోతున్నారు. ఎలక్షన్ రిజల్ట్ లో బుద్ది చెప్పినా.. వాళ్ళ స్టైల్ మార్చుకోకుండా ఇలా చేస్తే.. ఉన్న 11 ఎమ్మెల్యే లు ఉంటాయో లేదో డౌటే అని వ్యాఖ్యానించారు.
BJP Leader Kolanu Shankar: బాలాపూర్ లడ్డూను ప్రధాని మోడీకి అందిస్తాం..
టీడీపీ హయంలొనే ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమి ఉంది..? టీడీపీ తెచ్చిన కాలేజీలకు యన్టిఆర్ పేరూ ఉందని పేరును మార్చారు. కాలేజీల పట్ల, ఎడ్యుకేషన్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు. పెద్దవాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ రాకుండా విద్యార్థులకు, వాళ్ల తల్లిదండ్రులకు కాలేజీల చుట్టూ తిరిగేలా చేశారు. ఆ విషయాన్ని ఇప్పుడు మంత్రి లోకేష్ చక్కబెడుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రాజకీయాలు చేసిన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోతాం అని ఆయన తెలిపారు.
Allu Arjun : పుష్ప -2 తర్వాత బన్నీసినిమా ఆ దర్శకుడితోనే..