Site icon NTV Telugu

Karnataka Polls: కర్ణాటక ఎన్నికలకు బీజేపీ సారథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra Pradhan

Dharmendra Pradhan

Karnataka Polls: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఇన్‌ఛార్జిగా బీజేపీ శనివారం నియమించింది. కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. ఇప్పటికే అభివృద్ధి పనులు, బడ్జెట్‌ కేటాయింపులతో అక్కడి ప్రజలను ఆకట్టుకునే యత్నం చేసింది. ఇక ఈ ఏడాది వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. తాజాగా ఆ రాష్ట్రానికి ఎన్నికల సారథిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.

అలాగే.. కో ఇన్‌ఛార్జిగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా పేరుతో ఒక ప్రకటనను శనివారం విడుదల చేసింది. ఏప్రిల్-మేలో జరిగే ఎన్నికల కోసం అధికార పక్షం, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ తీవ్ర ప్రజాభిప్రాయాన్ని ప్రారంభించిన భారీ ఎన్నికలకు తమిళనాడు బీజేపీ యూనిట్ అధ్యక్షుడు కె. అన్నామలై కో-ఇంఛార్జిగా వ్యవహరిస్తారు. పార్టీకి చెందిన ప్రముఖ ఆర్గనైజేషన్ మ్యాన్ ధర్మేంద్ర ప్రధాన్ గతంలో అనేక ఎన్నికలను నిర్వహించే బాధ్యతను నిర్వర్తించారు.

Delhi Girl : ఢిల్లీలో ఘోరం.. దేశానికి కాదు దారుణాలకు రాజధాని

నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు, అతను ముఖ్యమైన దక్షిణాది రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నాలను పెంచడానికి స్థానిక యూనిట్‌లోని అంతర్గత సమస్యలను క్రమబద్ధీకరించేటప్పుడు రాష్ట్ర సంస్థను సమీకరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖలను ధర్మేంద్ర ప్రధాన్‌ చూసుకుంటున్నారు. ఒడిషాలో పుట్టిపెరిగిన ధర్మేంద్ర ప్రధాన్‌.. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్‌ తనయుడు. దేవేంద్ర ప్రధాన్‌.. వాజ్‌పేయి హయంలో కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌.. ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. బీజేపీలో పలు కీలక పదవులు చేపట్టారు. పలు రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగానూ పని చేశారు.

Exit mobile version