Site icon NTV Telugu

Tragedy: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పితృ వియోగం

Srinivas Verma

Srinivas Verma

Tragedy: నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు (91సం.లు) గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ హాస్పిటల్‌లో ప్రాణాలు విడిచారు. భూపతిరాజు శ్రీనివాస వర్మకు పితృ వియోగం కలిగినట్లు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం మధ్యాహ్నం స్వస్థలం అయిన భీమవరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సన్నిహితులు, బంధువులు వెల్లడించారు.

Read Also: Kejriwal: లిక్కర్ కేసులో ఎదురుదెబ్బ.. ట్రయిల్‌ కోర్టు విచారణపై స్టేకు హైకోర్టు నిరాకరణ

Exit mobile version