NTV Telugu Site icon

Anurag Thakur: ఈడీ, సీబీఐతో మా పార్టీకి సంబంధం లేదు..

Anurag

Anurag

ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED),సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వెస్టిగేష్‌న్‌(CBI) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ పదేళ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతిపరుడని దేశంలో ఏ ఒక్కరు కూడా ఆరోపణలు చేయలేదు అని ఆయన తెలిపారు. ఇక, 2013లో ఢిల్లీ సీఎం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితుల్లో జత కట్టనన్నారు.. ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీ వారి సొంతంగా ఏం సాధించలేదన్నారు. ప్రతి రోజు కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తారు.. వాళ్లు మోడీని ఎంత దూషిస్తే.. బీజేపీ అభ్యర్థులను ప్రజలు అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటారని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

Read Also: P.hd. Admissions: వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు అవసరం లేదు.. ఇక నెట్‌ స్కోర్‌ తోనే పిహెచ్‌డి ప్రవేశాలన్న యూజీసీ..!

ఇక, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేసింది.. ఎందుకు హాజరు కాలేదు అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. మళ్లీ విలువల గురించి వాళ్లు మాట్లాడతారు.. ఆయన ఈడీ ఆఫీసుకు హాజరు కాకపోతే.. ఈడీనే ఆయన ఇంటికి పోయింది.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆప్‌ ఒక్క సీటు కూడా గెలవలేదు.. మళ్లీ 2024 ఎన్నికలో సైతం ఆప్ ఒక్క సీటు గెలుచుకోదు.. ఈ రోజుకీ జైలులో ఉండి కూడా కేజ్రీవాల్‌ విలువల గురించి మాట్లాడటం దారుణం అన్నారు. ఇక, ఈడీ, సీబీఐ స్వతంత్ర సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీకి ఎలాంటి సంబంధంలేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

Read Also: Balayya : రికార్డులు కొత్తేమి కాదు.. సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే..!

అయితే, ప్రతిపక్షాల ఇండియా కూటమిపై కూడా కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల కూటమి నిజాయితీగా ఉంటే.. ఎందుకు ఆ కూటమి పేరు మార్చారు? అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ 2జీ, సబ్‌మెరైన్‌, బోగ్గు కుంభకోణాలు చేశారు అని ఆరోపించారు. ఆ తర్వాత దాణా కుంభకోణం చేసిన లాలు ప్రసాద్‌ యాదవ్‌ను సైతం కూటమిలోకి చేర్చుకున్నారు.. జైలుకు వెళ్లిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇండియా కూటమిలో ఉన్నారని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఎద్దేవా చేశారు.

Show comments