అమేథీ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను కేంద్రమంత్రి సమర్పించారు. స్మృతి ఇరానీ వెంట మధ్యప్రదశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక అమేథీలో ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. అనగా మే 20న ఇక్కడ ఓటింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో అమేథీ నుంచి స్మృతి ఇరానీ భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై 55 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరిగి ఇదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు.
ఇది కూడా చదవండి: Namburu Sankara Rao: మంచిని చూడండి.. మనసారా ఆశీర్వదించండి: నంబూరు శంకరరావు
ఇదిలా ఉంటే అమేథీ మొదట నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది. అలాంటిది 2019 ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ పరాజయం చూడాల్సి వచ్చింది. స్మృతి ఇరానీ చేతిలో ఘోర ఓటమి చెందారు. కానీ కేరళలోని వయనాడ్ నుంచి మాత్రం రాహుల్ గెలిపొందారు. ఈసారి కూడా అక్కడే నామినేషన్ వేశారు. అలాగే అమేథీలో కూడా రాహులే పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు శనివారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై.. రాయ్‌బరేలీ, అమేథీ అభ్యర్థుల ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: Beetroot Benefits : బీట్ రూట్ జ్యూస్ ను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. మేథీలో గత 5 సంవత్సరాలలో 1,14,000 ఇళ్ళు నిర్మించబడ్డాయని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 1.5 లక్షల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు అందాయని వెల్లడించారు. అలాగే 4 లక్షల మందికి పైగా రైతులు ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధిని అందుకున్నారని చెప్పారు. అందుకోసమే ప్రజలు ప్రధాని మోడీని, బీజేపీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు.