NTV Telugu Site icon

Amit Shah: 2026 మార్చి నాటికి ఒక్కరు కూడా ఉండరు!.. నక్సల్స్‌ కి అమిత్ షా హెచ్చరిక..

Amith Sha

Amith Sha

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. శనివారం రాయ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్సల్స్‌ దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రజలకు అభివృద్ధిపై నమ్మకం ఉందన్నారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా నక్సల్స్ సమస్య నుంచి విముక్తి పొందాయని తెలిపారు. నక్సల్స్ దాడులు 54 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని హోంమంత్రి తెలిపారు. 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్నారు. ఎవ్వరినీ వదలమని హెచ్చరించారు.

READ MORE: Tragedy: విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు

శనివారం రాయ్‌పూర్‌లో నక్సలిజం సమస్యపై హోంమంత్రి సమావేశం నిర్వహించారు. ఇందులో అభివృద్ధి అంశంపై కూడా చర్చ జరిగింది. విలేఖరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. “నేను ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం పాత సమస్యే. నక్సల్ ప్రభావిత జిల్లాల్లో భారత ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ పథకాలన్నింటినీ 100 శాతం అమలు చేస్తాం. వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రభావిత ప్రాంతాలు పురోగతి మార్గంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాం.” అని ఆయన పేర్కొన్నారు. నేడు జరిగిన సమావేశంలో ఛత్తీస్‌గఢ్‌తో సంబంధం ఉన్న అన్ని రాష్ట్రాల డీజీలు, ప్రధాన కార్యదర్శులను కూడా పిలిచామని అమిత్ షా తెలిపారు. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ సమస్యను పరిష్కరించేందుకు పూనుకున్నప్పుడు పొరుగు రాష్ట్రాల పరిస్థితులు తెలుసుకోవడం అవసరమన్నారు. ఇప్పుడు బలమైన వ్యూహంతో వామపక్ష తీవ్రవాదంపై తుది దెబ్బ కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని హోంమంత్రి అన్నారు.