NTV Telugu Site icon

Amit Shah: బీజేపీకి 400 స్థానాలు.. కాంగ్రెస్‌ 40 సీట్లే వస్తాయి..

Amit Shah

Amit Shah

Amit Shah: హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక, భారత కూటమికి ప్రధాని పదవికి అభ్యర్థి లేరని అన్నారు. విపక్ష కూటమిలో ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ప్రధానిగా ఉంటారని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా ప్రభుత్వం ఇలాగే నడుస్తుందా అని షా ప్రశ్నించారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని నడపడం అంత తేలికైన విషయం కాదు అని అమిత్ షా వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 కంటే తక్కువ సీట్లు గెలుకుంటుంది.. కానీ, ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో విజయం సాధించబోతుందన్నారు.

Read Also: Bengaluru Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు.. నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు

ఈ ఎన్నికల్లో ఓ వైపు 6 నెలలకోసారి సెలబ్రేషన్స్ చేసుకునే రాహుల్ బాబా.. మరోవైపు గత 23 ఏళ్లుగా దీపావళికి కూడా సరిహద్దుల్లో సైనికులతో మిఠాయిలు తింటున్న నరేంద్ర మోడీ ఉన్నారని కేంద్రహోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశ ప్రజల ముందు రెండు రకాల ఉదాహరణలున్నాయని చెప్పుకొచ్చారు. రాహుల్, అతని సోదరి సెలవుల కోసం సిమ్లాకు వస్తారు.. కానీ, అయోధ్యకు రారు అని ఆయన అన్నారు. కేవలం, ఓటు బ్యాంకుకు భయపడి అయోధ్యలోని రామమందిరానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడం లేదని అమిత్ షా దుయ్యబట్టారు.

Read Also: Rain Alert : కేదార్‌నాథ్, యమునోత్రి, చార్ ధామ్ లో భారీ వర్షం.. భక్తులకు హెచ్చరిక

ఇక, పీఓకే విషయంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై కూడా అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) గురించి మాట్లాడవద్దని కాంగ్రెస్ నేతలు మమ్మల్ని భయపెడుతున్నారని తెలిపారు. పాకిస్థాన్‌లో అణుబాంబు ఉందని మమ్మల్ని వాళ్లు భయపెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. మేము (బీజేపీ) అణుబాంబుకు భయపడమన్నారు. POK భారతదేశానికి చెందినది.. దాన్ని తిరిగి మేము స్వాధీనం చేసుకుంటాని అమిత్ షా వెల్లడించారు.