Central Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని కామరాజర్ పోర్ట్‌లో రెండో కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి రూ. 4,288 కోట్లు, అసోంలోని సిల్చార్‌లోని దోలూ వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ అభివృద్ధికి రూ. 2,014 కోట్లతో సహా ఐదు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
కామరాజర్ పోర్ట్ లిమిటెడ్‌లో రెండో కంటైనర్ టెర్మినల్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) పద్ధతిలో డీబీఎఫ్ఓటీ విధానంలో రూ. 4,288.26 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో మొదటి దశకు రూ. 2,429.32 కోట్లు, రెండో దశకు రూ. 1,858.94 కోట్లు ఖర్చు చేస్తారు. 40 ఏళ్ల రాయితీ కాలపరిమితిలో 48 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 900 మీటర్ల పొడవు, 18 మీటర్ల డ్రాఫ్ట్‌తో నిర్మించే ఈ టెర్మినల్ ద్వారా ఏటా 20 లక్షల టీఈయూల (2.0 million TEUs) కంటైనర్ల సామర్థ్యం సమకూరుతుంది.
Also Read
- Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ రాజీనామా..
- Imran: ‘మేము బిచ్చగాళ్లం కాదు’.. ఎస్పీ సీట్ల ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్..
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. ఆస్తుల విచారణపై అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు రద్దు!
- Delhi riots UAPA case: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు షాక్.. మధ్యంతర బెయిల్ నిరాకరణ!
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఎగుమతి, దిగుమతుల (EXIM) రవాణాకు ఇది ఎంతో తోడ్పడుతుంది. నిర్మాణ సమయంలో సుమారు 750 మందికి, నిర్వహణ దశలో సుమారు 800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డ్రెడ్జింగ్ కోసం కామరాజర్ పోర్ట్ మరో రూ. 450 కోట్లు భరించనుంది.
అసోంలోని కచార్ జిల్లాలో బరాక్ లోయకు గుండెకాయ లాంటి దోలూ వద్ద రూ. 2,014 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నారు. 12,351 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పీక్ అవర్‌లో 800 మంది ప్రయాణికులకు సేవలందించేలా టెర్మినల్ భవనం, ఏ-320 విమానాలు నడిచేందుకు అనువైన 2,705 మీటర్ల రన్‌వే, 6 విమానాల పార్కింగ్ సామర్థ్యంతో ఆప్రాన్ నిర్మిస్తారు. తేయాకు తోటలు, పర్యాటకం, వాణిజ్యానికి ఇది ఊతమిచ్చి ఈశాన్య భారతాన్ని మరింత అనుసంధానిస్తుంది.
వీటితో పాటు నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల తయారీ పర్యావరణ వ్యవస్థ కోసం రూ. 11,000 కోట్ల పథకానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎనిమిదేళ్ల పాటు అమలయ్యే ఈ పథకం ద్వారా షిప్-టు-షోర్ క్రేన్లు, టన్నెల్ బోరింగ్ మెషీన్లు, హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లు వంటి అత్యాధునిక పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించడంతో పాటు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. 2024-25లో సుమారు రూ. 97,500 కోట్లుగా ఉన్న భారత సీఐఈ పరిశ్రమ 2029-30 నాటికి రూ. 2,28,100 కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే తపాలా శాఖ పరిధిలోని పోస్టల్ ఆపరేషన్స్ పథకానికి రూ. 1,141 కోట్లు, ఎస్టేట్స్ మేనేజ్మెంట్ పథకానికి రూ. 1,491 కోట్ల కేటాయింపులకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
తాజావార్తలు
-
Central Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్..
-
Sampath Nandi: ఆ ఒక్క కారణంతోనే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకున్నా..
-
Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ రాజీనామా..
-
Mega Box Office Clash: ‘కాకా’ కర్చీఫ్ వేసిన చోటే ‘విశ్వంభర’ కన్ను.. సంక్రాంతి బరిలో మెగా క్లాష్?
-
Sreejith Ravi : బాలికలతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసులో ప్రముఖ విలన్‌కు షాక్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!