NTV Telugu Site icon

Union Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. పార్లమెంట్లో ప్రసంగించనున్న రాష్ట్రపతి

Ysrcp Droupadi Murmu

Ysrcp Droupadi Murmu

Union Budget : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా ఉభయసభలనుద్దేశిస్తూ ఆమె చేస్తున్న తొలి ప్రసంగం ఇది. అనంత‌రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ లోక్ స‌భ‌లో ఆర్థిక స‌ర్వేను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం 36 కొత్త బిల్లుల‌ను ప్రవేశపెట్టనుంది. బుధవారం ఆర్ధిక మంత్రి లోక్‌సభలో 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

Read Also: AP 3 Capitals Issue:మూడు రాజధానులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

పార్లమెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు రెండు విడ‌త‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13 వ‌రకు, ఆ త‌ర్వాత మార్చి 13 నుంచి ఏప్రిల్ ఆరు వ‌ర‌కు స‌మావేశాలు నిర్వహిస్తారు. 27 సార్లు స‌భ స‌మావేశం కానుంది. వాడీవేడీ చర్చలకు ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వేదికకానున్నాయి. అదానీ – ఎల్ఐసీ, బీబీసీ- మోదీ డాక్యుమెంట‌రీ వివాదంపై చ‌ర్చించాల్సిందేన‌ని ప్రతిపక్షాలు ప‌ట్టు ప‌డుతున్నాయి. అందుకు బ‌దులు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో పాటు ఆప్ రాష్ట్రప‌తి ప్రసంగానికి దూరంగా ఉంటున్నాయి.

Read Also: Fire Accident: అమరరాజా గ్రోత్ కారిడార్ లో భారీ అగ్నిప్రమాదం

Show comments