హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. ఓ బిల్డింగ్‌లోని పెంట్ హౌజ్‌లో ఉన్న బాలికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పట్టపగలే కూకట్‌పల్లి మర్డర్ జరగడం కలకలం సృష్టిస్తోంది. అసలు ఈ మర్డర్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు సహస్ర. నిండా 12 ఏళ్లు లేని ఈ అమ్మాయికి అప్పుడే నూరేళ్లు నిండాయి. ఈమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు.
Also Read:Rajinikanth: దటీజ్ రజనీకాంత్.. కోట్లు కుమ్మరిస్తామన్నా కక్కుర్తి పడలేదు!
కూకట్‌పల్లిలో కృష్ణ, రేణుక దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు సహస్ర కాగా.. ఓ కుమారుడు ఉన్నాడు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలనే ఉద్దేశ్యంతో దంపతులు ఇద్దరూ పనులు చేస్తున్నారు. కృష్ణ స్థానికంగా బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రేణుక స్థానికంగా ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తోంది. ఉదయమే ఇద్దరూ తమ తమ పనులకు వెళ్లిపోతారు. పిల్లలు కూడా స్కూలుకి వెళ్లిపోతారు.
Also Read:Cyber Crime: సైబర్ నేరాలపై కేంద్ర హోంశాఖ స్పెషల్ ఫోకస్.. రూ.5489 కోట్లు స్వాధీనం
గడియ తీసుకుని లోపలికి వెళ్లి షాకైన కృష్ణ
కూకట్‌పల్లిలోని ఓ బిల్డింగ్‌లో పైన పెంట్ హౌజ్‌లో అద్దెకు ఉంటోంది కృష్ణ కుటుంబం. ఐతే ఇవాళ స్కూల్ లేకపోవడంతో సహస్ర ఇంట్లోనే ఉంది. కొడుకు మాత్రం స్కూలుకి వెళ్లాడు. కొడుక్కి లంచ్ బాక్స్ ఇవ్వాల్సి ఉందని స్కూల్ నుంచి ఫోన్ రావడంతో కృష్ణ ఇంటికి వచ్చాడు. అతను వచ్చే సరికి ఇంటి బయట గడియ పెట్టి ఉంది. గడియ తీసుకుని లోపలికి వెళ్లగానే షాక్ అయ్యాడు. బెడ్ పైన కూతురు కత్తిపోట్లతో పడి ఉంది. అసలేం జరిగిందో తెలియలేదు. వెంటనే పోలీసులకు, 108కి సమాచారం ఇచ్చాడు కృష్ణ. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తద్వారా నిందితులు ఎవరో గుర్తిస్తామని చెబుతున్నారు పోలీసులు.
Also Read:Tollywood: చిరంజీవి ఇంట్లో ఫెడరేషన్ నాయకుల సమావేశం.
మరోవైపు చిన్నారి సహస్ర మృతిపై కన్న తల్లి రేణుక విపరీతంగా విలపిస్తోంది. తమకు ఎవరితోనూ విభేదాలు లేవని చెబుతోంది. అలాగే ఎలాంటి కుటుంబ కలహాలు కూడా లేవంటోంది రేణుక. స్కూల్‌కి సెలవు కావడంతో సహస్ర ఇంట్లో ఉందన్న రేణుక.. బిల్డింగ్‌లో అందరినీ విచారించాలని కోరింది. ఎవరైనా దొంగతనానికి వచ్చి.. చిన్నారి సహస్రను చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. మరోవైపు మూడంతస్తుల బిల్డింగ్‌పైకి ఎవరు వెళ్లినట్లు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఆడ పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉందంటున్నారు. సహస్ర మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
