Avanigadda Crime: కృష్ణా జిల్లా అవనిగడ్డలో యువకునిపై కత్తితో దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. అవనిగడ్డ 2వ వార్డులో నివాసం ఉంటున్న ఆకుల శ్రీనివాస్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు.. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు.. తీవ్ర గాయాలతో అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు శ్రీనివాస్.. యువకునిపై కత్తులతో దాడి చేసి సంఘటన స్థలం నుంచి దుండగులు పారిపోగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన అవనిగడ్డ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. అసలు యువకుడిపై దాడి చేసింది ఎవరు? కారణం ఏమై ఉంటుంది? అనే కోణంలో విచారణ చేపట్టారు అవనిగడ్డ పోలీసులు. అయితే, ఎన్నికల సమయంలో ఈ దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. దాడి వెనుక ఎన్నికలకు సంబంధించిన ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు పోలీసులు..
Avanigadda Crime: అవనిగడ్డలో యువకునిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం..!
Show comments