Site icon NTV Telugu

Kolkata: కుప్పకూలిన 5 అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

Kolkata

Kolkata

Kolkata: కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 10 మంది చిక్కుకున్నారు. అందులో ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం, నిర్మాణంలో ఉన్న భవనం చుట్టూ అనేక గుడిసెల వంటి ఇళ్లు ఉన్నాయి. గుడిసెలాంటి ఈ ఇళ్లలో ఒకదానిపై భవనం పడింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద కూరుకుపోయిన 10 మందిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు ప్రకటించారు.

Read Also: Bihar : పెళ్లి ఊరేగింపు కారు.. ట్రాక్టర్‌ ఢీ.. ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి

ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాలన్నీ పరోక్షంగా పాలనాధికారి సహకారంతోనే సాగుతోందన్నారు. కూలిన భవనాన్ని కూడా అక్రమంగా నిర్మిస్తున్నారని కొందరు ఆరోపించారు. శిథిలాల కింద కూరుకుపోవడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోల్‌కతా పోలీసులు, అగ్నిమాపక దళం బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌లో అధికార యంత్రాంగంతో పాటు స్థానికులు కూడా సహకరించారు. శిథిలాల కింద నుంచి 10 మందిని రక్షించి సమీపంలోని కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. అందులో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు ప్రకటించారు.

Exit mobile version