Under 19 Asia Cup: పురుషుల అండర్-19 ఆసియా కప్ 2024లో భారత జట్టు పాకిస్థాన్‌పై భారత్ 43 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చుసిన తర్వాత, జపాన్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 211 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జపాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు జపాన్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో జపాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 211 పరుగులతో విజయాన్ని అందుకుంది.
Under 19 Asia Cup: భారీ తేడాతో జపాన్ ను చిత్తు చేసిన టీమిండియా కుర్రాళ్లు
- పురుషుల అండర్-19 ఆసియా కప్ 2024లో
- టీమిండియా 211 పరుగులతో
- జపాన్ పై గెలుపు