Undavalli Arun Kumar: వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలు నిలిచిపోయేవి.. మరిచిపోయేవి కావు అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. వైఎస్ 75వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. వైఎస్.. పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి.. ఆయన మరణించిన నాటి వరకు ఆయనతో నా ప్రయాణం కొనసాగింది.. ఆ ప్రయాణం కొనసాగేలా చేసిన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు అని గుర్తుచేసుకున్నారు.. వైఎస్ మరణం తర్వాత నాకు తెలిసింది.. ఆయన మామూలు మనిషి కాదు.. మహా నేత అన్నారు.. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఎంతోమంది చనిపోతే నాకు ఆశ్చర్యం వేసిందన్నారు.. ఇక, హైదరాబాద్‌లో జరిగినట్టుగా గణేష్ నిమజ్జనం ఎక్కడా జరగదు.. కానీ, వైఎస్ మరణం తర్వాత జరిగి గణేష్ నిమజ్జనం మాత్రం సైలెంట్‌గా జరిగింది.. అన్ని విగ్రహాల దగ్గర వైఎస్ ఫొటోను పెట్టుకుని గణేష్ విగ్రహాలను తీసుకొచ్చారు.. వినాయకుడి విగ్రహంతో పాటు వైఎస్ ఫొటోలను కూడా నిమజ్జనం చేశారు.. అది చూసిన తర్వాత నాకు అనిపించింది వైఎస్ దేవుడిలో కలిసిపోయాడని అన్నారు..
Read Also: CM Revanth Reddy: ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇక, బతికితే ఇలా బతకాలిరా.. అనే ముద్రవేసి వెళ్లిన వ్యక్తి వైఎస్ అన్నారు ఉండవల్లి.. ఆయన జీవితం మొత్తం పోరాటమే.. అంతా అసమ్మతే.. కానీ, ఆయన సీఎం అయిన తర్వాత ఏ మాత్రం వ్యతిరేకత లేని వ్యక్తి అని అభివర్ణించారు. దానికి ఒకటే కారణం.. ఆయన చిరునవ్వు మాత్రమే అన్నారు.. ఎవరు వచ్చినా.. ఆప్యాయంగా పలకరింపు.. ఆయన దృష్టికి సమస్య వెళ్లిందంటే.. అది పరిష్కారం అయిపోవాల్సిందే.. కానీది ఏదైనా ఉంటే.. వెంటనే సమాచారం ఇచ్చేవారిని గుర్తుచేసుకున్నారు.. మరోవైపు.. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గురించి ఉండల్లి మాట్లాడుతూ.. తెలంగాణ కు నష్టం లేకుండా ఏపీకి మంచి చేయండి.. ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య శాశ్వతంగా అనుబంధం కలిగించే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంది.. అది కాంగ్రెస్ వారికి మార్క్‌గా పేర్కొన్న ఆయన.. ఆంధ్రా వారికి తెలంగాణ మీద ఎటువంటి ద్వేషం లేదు.. కానీ, తెలంగాణ వారి కోపానికి కారణం ఉందన్నారు. ఏపీ తెలంగాణ టెక్నికల్ గా రెండు రాష్ట్రాలు మాత్రమే తప్ప ప్రజలు ఒకటే అన్నారు.. ఇక, ఈ సందర్భంగా ఉండల్లి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..