NTV Telugu Site icon

Tragedy: తమ్ముడి మృతి తట్టుకోలేక ఆగిన అక్క గుండె

Heart Attack

Heart Attack

Tragedy: మృత్యువులోనూ ఆ రక్త సంబంధం వీడలేదు. తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క గుండె ఆగిపోయింది. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. తాటిపల్లికి చెందిన పిల్లి జలపతి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి సోదరి చింత రాజవ్వ త సోదరుడి భౌతికకాయాన్ని చూసి బోరున విలపించింది. మృతదేహం వద్ద రోదిస్తూ అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందింది. ఇరువురి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Read Also: Jammu and Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు.. ఎదురుదాడిలో టెర్రిరిస్ట్ హతం

Show comments