Site icon NTV Telugu

United Nations: భారత అంతర్గత వ్యవహరాలపై ఐక్యరాజ్య సమితి రియాక్షన్..

Un

Un

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, లోక్‌ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను ఫ్రీజ్‌ చేయటం లాంటి అంశాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి రియాక్ట్ అయింది. అయితే, ఇటీవల ఈ అంశాలపై అమెరికా స్పందించగా.. భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు కూడా జరీ చేయగా.. ఇక, ఒక్క రోజు వ్యవధిలోనే ఐక్యరాజ్య సమితి స్పందించింది.

Read Also: China : అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమే.. చైనాకు తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రిత్వ శాఖ

అయితే, భారత్‌లో లోక్‌సభ ఎన్నికల ముందు విపక్ష సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌, ప్రతిపక్ష పార్టీ ఖాతాల స్తంభనతో నెలకొన్న రాజకీయ అనిశ్చిత్తిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పందించారు. భారతదేశంతో పాటు ఎన్నికలు జరిగే ప్రతి దేశంలోను రాజకీయ, పౌర హక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నామన్నారు. స్వేచ్ఛ, న్యాయమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని నమ్ముతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై ఇప్పటికే జర్మనీ, అమెరికా స్పందించింది. అలాగే, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అకౌంట్లపై అమెరికా సెకండ్ టైమ్ స్పందించటం గమనార్హం. అయితే, దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది.. అలాగే, ఈ అంశాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహరం అని స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ప్రతి ఒక్క దేశం గౌరవించాలని ఇండియా పేర్కొంది.

Exit mobile version