NTV Telugu Site icon

Umesh Yadav : ఇదే నాకు చివరి సీజన్.. కెప్టెన్సీ నాకు కొత్త కాదు..

Umesh Yadav

Umesh Yadav

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ టెస్ట్ జటులో రెగ్యులర్ భాగమయ్యాడు. అయితే అతని ODI ప్రదర్శనలు ఇటీవల చాలా దారుణంగా పడిపోయింది. 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో టీ20 జట్టులో ఉమేశ్ యాదవ్ ను తీసుకున్నారు. కానీ అతను ఒక్క గేమ్ ఆడాలేదు. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో ఉమేష్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ తరపున ఆడుతున్నాడు. ఈ లీగ్ లో మెరుగైన ప్రదర్శన చేసి తిరిగి వన్డే జట్టులోకి వస్తానంటు ఉమేశ్ యాదవ్ అన్నాడు. ఎందుకంటే ఈ ఏడాది( 2023) భారతదేశం ODI ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

Also Read : Special Package For Ap: ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి

ప్రతి నాలుగు సంవత్సరాల తర్వాత ODI ప్రపంచ కప్ జరుగుతుంది. ప్రపంచ కప్ జట్టులో భాగమయ్యేందుకు ఇదే తనకు చివరి అవకాశం.. కాబట్టి, నేను ఐపీఎల్‌లో బాగా రాణించి వన్డే ఫార్మాట్‌లో పునరాగమనం చేయాలి” అని ఉమేశ్ యాదవ్ చెప్పాడు. అయితే నేను వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉంటానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదన్నాడు. అందుకే నాకు ఈ సీజనే నాకు లాస్ట్ ది అని లెక్కించాలనుకుంటున్నాను.. మరో నాలుగు సంవత్సరాలు వేచి ఉండలేనని ఉమేశ్ యాదవ్ పేర్కొన్నాడు. 2022లో 12 మ్యాచ్‌ల్లో 16 వికెట్లతో ఉమేష్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.

Also Read : Pakistan Economic Crisis: ప్రాణాలు కాపాడే మందుల కోసం అల్లాడుతున్న పాకిస్తాన్..

మరో వైపు ఐపీఎల్ ఫ్రాంచైజీతో తన ఐదేళ్ల అనుబంధం.. దానిలో భాగంగా పాల్గొనడం ద్వారా ఇప్పటికే తాను యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకి తాజాగా నియమించబడిన తాత్కాలిక కెప్టెన్, నితీష్ రాణా పేర్కొన్నాడు. నాయకత్వ పాత్ర తనకు కొత్తది కాదు అని నితీశ్ రాణా అన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ తన IPL 2023లో పోరులో పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 1న మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియంలో ప్రారంభించనుంది.

Also Read : AP Highcourt: కంచికామాక్షి ఏకాంబరేశ్వర స్వామి ఆలయ భూములపై పిల్

నాకు ఇది కొత్త కాదు.. నేను కొన్ని సంవత్సరాలుగా ఈ ఫ్రాంచైజీలో నాయకత్వ పాత్రను పోషిస్తున్నాను. ఈసారి మాత్రం కొత్తగా కెప్టెన్‌ అనే ట్యాగ్ ఉందని నితీశ్ రాణా అన్నారు. నేను ట్యాగ్‌పై అదనపు ఒత్తిడిని తీసుకుంటే, నా ఆట దెబ్బతుంటుంది.. అందుకే నేను భయపడటం లేదని ఆయన తెలిపారు. మొదటి సారి ఏదైనా కొత్తది చేసినప్పుడు, కొంత ఒత్తిడి పెరుగుతుంది.. కానీ నేను దాదాపు 100 గేమ్‌లు ఆడాను, నాకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే నేను ఒత్తిడిలోనే అభివృద్ధి చెందుతాను అని కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా వెల్లడించాడు.