Site icon NTV Telugu

Lydia Lakshmi: పర్మీషన్ ఇస్తే అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొస్తా: ఉక్రెయిన్ మహిళ

Lydia Lakshmi

Lydia Lakshmi

Lydia Lakshmi: తెలుగు యూట్యూబర్ అన్వేష్‌ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ పర్యాటకుడిగా ప్రసిద్ధి చెందిన ఈ వ్యక్తి అనేక దేశాల్లో పర్యటిస్తూ యూట్యూబ్‌లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్‌ను సంపాధించాడు. కానీ.. వికృత చేష్టలు, రెచ్చగొట్టే, జుగుప్సాకర వ్యాఖ్యలతో ఇటీవల భారీగా వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు. ఇటు హిందూ దేవతలు, ఇటు మహిళల పట్ల అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై తాజాగా విదేశీ మహిళ విరుచుకుపడింది. నాకు పర్మీషన్ ఇవ్వండి.. అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకోస్తా అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది.

READ MORE: Khawaja Asif: పాక్ రక్షణ మంత్రి గొప్పలు.. భారత్‌తో యుద్ధం తర్వాత హాట్ కేకుల్లా జెట్‌లు కొంటున్నారు

ఉక్రెయిన్‌కి చెందిన లిడియా లక్ష్మి ఆంధ్రా అబ్బాయి తుమ్మపాల వెంకట్‌ను వివాహం చేసుకున్నారు. భారతదేశంలోని సనాతన ధర్మానికి ఆమె ఫిదా అయ్యారు. ఇక్కడి సంస్కృతి, సనాతన ధర్మాన్ని స్టడీ చేసిన లక్ష్మి ధర్మంపట్ల తన నిబద్ధతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నా అన్వేష్‌ భారతీయ సంప్రదాయాలపై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. థాయిలాండ్‌ ఎంబసీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న ఆమె తనకు అవకాశం ఇస్తే అన్వేష్‌ను పట్టుకొస్తానని చెబుతున్నారు. లేకపోతే మరో దేశానికి అతడు పారిపోయే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. భారత్‌కు పట్టుకు రావడానికి గల అవకాశాలను క్లుప్లంగా వివరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE: Ankush Bharadwaj: మైనర్ షూటర్‌పై లైంగిక దాడి.. కోచ్ అంకుష్ భరద్వాజ్‌పై పోక్సో కేసు!

మరోవైపు.. అన్వేష్ తీరుపై అటు నెటిజన్లు, ఇటు సినీప్రముఖులు సైతం మండిపడుతున్నారు. అటు హిందూ దేవతలు, ఇటు మహిళల పట్ల అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముందుగా అసలు ఆ వీడియోలు పోస్ట్ చేసింది అన్వేషా.. కాదా అని నిర్ధారణకు వచ్చేందుకు ఇన్స్టాగ్రామ్‌కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాశారు. వీడియో పోస్ట్ అయినా యూజర్ ఐడితో పాటు URL ను జోడించి instagramకు లేఖ పంపారు. వీటి వివరాలను తమకు ఇవ్వాల్సిందిగా పంజాగుట్ట పోలీసులు లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version