Site icon NTV Telugu

Immigration Scam: వామ్మో ఆమెకు 15 మంది భర్తలు.. ఈ పాపం ఆమెకే తెలియదంటా..

Immigration Scam

Immigration Scam

Immigration Scam: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఆమెకు ఏకంగా 15 మంది భర్తలు ఉన్నారనే విషయం సంచలనం సృష్టించింది. ఇది నిజంగా మాములు విషయం కాదు. ఇక్కడ విశేషం ఏమిటంటే తనకు అంత మంది భర్తలు ఉన్నట్లు ఆమెకే తెలియదు. ఇది నిజం అండీ బాబు.. ఆమె ఏమో ఇంగ్లాండ్‌లో ఉంటుంది.. తన భర్తలు అని చెప్పుకొని 15 మంది ఇంగ్లాండ్‌కు వచ్చారు. అసలైన భర్త రావడానికి ప్రయత్నించినప్పుడు దొంగ భర్తల విషయం బయటపడింది. విషయం ఇంగ్లాండ్‌లో బయటికి రావడంతో ఆమెను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈ కథ ఏంటి, ఏం జరిగింది.. ఈ దొంగ భర్తలు ఎవరూ.. ఆమెకు వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Racism : ఆస్ట్రేలియాలో రెచ్చిపోతున్న రేసిజం.. ఇండియన్సే టార్గెట్..

బాబోయ్ దొంగ భర్తలు..
అలంపూర్‌కు చెందిన భిందర్ సింగ్ భార్య ఇంగ్లాండ్‌లో ఉంటుంది. ఈక్రమంలో భిందర్ సింగ్ తన కొడుకుతో కలిసి ఇంగ్లాండ్ వెళ్లాల్సి వచ్చింది. దానికి తన భార్య స్పాన్సర్‌షిప్ కూడా పంపింది. దాంతో మనోడు ఇంగ్లాండ్ వెళ్లడానికి ఇమ్మిగ్రేషన్ కంపెనీ నడుపుతున్న ప్రశాంత్, ఆయన భార్య రూబీ దగ్గరకు వెళ్లాడు. వాళ్లు మనోడి నుంచి దరఖాస్తు చేసినందుకు రూ.5.90 లక్షలు వసూలు చేశారు. మొత్తానికి అప్లై చేశామని చెప్పారు.. ఎన్నేళ్లు అయినా ఎంతకూ ఇంగ్లాండ్‌కు వెళ్లడానికి భిందర్ సింగ్ వీసా ఇవ్వడం లేదు.

ఇంగ్లాండ్‌లో వెలుగులోకి వచ్చిన మోసం..
ఇదే సమయంలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఇంగ్లాండ్‌లో తన భార్యను అరెస్టు చేశారని భిందర్ సింగ్‌కు మెసేజ్ వచ్చింది. తన పత్రాలను దుర్వినియోగం చేసి 15 మంది యువకులను తన భార్యకు భర్తలుగా మార్చి విదేశాలకు పంపారని భిందర్‌కు తెలిసింది. పాపం ఈ ఘటనకు సంబంధించి తన భార్యకు ఏ పాపం తెలియదని భిందర్ సింగ్‌ చెప్పారు. దీనికి పాల్పడింది ఇమ్మిగ్రేషన్ కంపెనీ నిర్వాహకులు ప్రశాంత్, ఆయన భార్య రూబీగా గుర్తించారు. వెంటనే బాధితుడి ఫిర్యాదు మేరకు వారిద్దరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

READ ALSO: CM Revanth Reddy: గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు: సీఎం రేవంత్ రెడ్డి

Exit mobile version