ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత్ తో పాటు ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 242 మంది ప్రయాణిస్తున్న విమానం క్షణాల్లోనే క్రాష్ అయి మంటల్లో చిక్కుకుని కాలిబూదిదైపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 130 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. కొందరు ఘటనా స్థలంలోనే సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో భారతీయులతో పాటు విదేశీయులు సైతం భారీగానే ఉన్నారు. ఈ విమానంలో దాదాపు 53 మంది బ్రిటిష్ జాతీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో లండన్‌కు వెళ్తున్న విమానం కూలిపోవడంపై యూకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ స్పందించారు.
Also Read:Air India Plane Crash: కన్నప్ప నార్త్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాన్సిల్
కైర్ స్టార్మర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “చాలా మంది బ్రిటిష్ జాతీయులతో లండన్ వెళ్తున్న విమానం భారత్ లోని అహ్మదాబాద్ నగరంలో కూలిపోతున్న దృశ్యాలు వినాశకరమైనవి” అని రాసుకొచ్చారు. విమానంలో ప్రయాణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు. ” ప్రమాదానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది, ఈ తీవ్ర బాధాకరమైన సమయంలో ప్రయాణికులు, వారి కుటుంబాలతో వెన్నంటి ఉంటానని తెలిపారు.
Also Read:Air India Plane Crash: ప్రమాద సమయంలో 80-90 టన్నుల ఇంధనం.. ‘‘ఫ్యూయల్ డంప్’’ సమయం కూడా లేదు..
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయింది. ఎయిర్ ఇండియా 171గా పనిచేస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ 242 మందితో వెళ్తున్నప్పుడు క్రాష్ అయ్యింది. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వారు, ఏడుగురు పోర్చుగీస్ వారు, ఒకరు కెనెడియన్ ఉన్నారు.
