Site icon NTV Telugu

Passenger Attacks Steward: థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానం సిబ్బందిపై బ్రిటన్ ప్యాసింజర్ దాడి

London

London

థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో బ్రిటన్‌కు చెందిన ప్రయాణికుడు నానా రచ్చ చేశాడు. కోపంలో ఏకంగా విమాన సిబ్బందిలో ఒకరిపై చేయి చేసుకున్నాడు.. ఇక, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే, విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్యాసెంజర్ వీడియోను రికార్డు చేసి నెట్టింట పోస్టు చేశాడు.

Read Also: Wedding Season: పెళ్లిళ్ల సీజన్‌.. మల్లెపూలకు పెరిగిన డిమాండ్

అయితే, బ్యాంకాక్ నుంచి లండన్‌కు వెళుతున్న విమానంలో ఫిబ్రవరి 7వ తేదీన ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇక, నిందితుడు ఫస్ట్ విమానం టాయ్‌లెట్‌లోకి వెళ్లి.. ఆ తరువాత ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ బాత్రూమ్ తలుపులపై గట్టిగా తన్ని వాటిని విరగ్గొట్టాడు. అర్ధనగ్నంగా ఉన్న అతడు రచ్చ రచ్చ చేశాడు. ఇక, ఇదంతా చూసిన ఇతర ప్రయాణికులు అతడిని నిలువరించే క్రమంలో గొడవ స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన క్రూ సిబ్బందిలో ఒకరిపై బ్రిటన్ ప్యాసింజర్ చేయి చేసుకుని, దాడికి పాల్పడటంతో బాధితుడి ముక్కు పగిలిపోయింది.

Read Also: BJP MP K. Laxman: మూడో సారి మోదీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారు..

ఇక, ఈలోపు ఇతర ప్రయాణికులు అతడి చేతులు కట్టేసి సీటులో కూర్చోబెట్టారు. ఇక, ప్రయాణం ముగిసే వరకూ పక్కనే ఉండి అతడు కదలకుండా ఆపేశారు. అయినా కూడా అతడు దుర్భాషలాడుతూ నానా రచ్చ చేశాడని ఇతర ప్రయాణికులు వెల్లడించారు. ఇక, లండన్‌లోని హిత్రూ విమానశ్రయానికి చేరుకున్నాక స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి దిగినందుకు, విమానాన్ని ప్రమాదంలో పడేసినందుకు బ్రిటన్ ప్యాసింజర్ పై కేసు నమోదు చేశారు.

Exit mobile version