NTV Telugu Site icon

Ujjain Mahakaleshwar temple: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ ప్రసాదానికి సేఫ్ భాగ్ అవార్డు.. ఎలా తయారు చేస్తారంటే ?

New Project 2024 09 21t123453.356

New Project 2024 09 21t123453.356

Ujjain Mahakaleshwar temple: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వరాలయం ఉంది. బాబా మహాకాళుని దర్శనం కోసం దేశంలోని నలుమూలల నుండి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ సమయంలో భక్తులు తమతో పాటు శెనగపిండి లడ్డూల ప్రసాదాన్ని కూడా తీసుకుంటారు. ఈ ప్రసాదాన్ని శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ భక్తుల కోసం సిద్ధం చేసింది. శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పీయూష్ త్రిపాఠి మాట్లాడుతూ బాబా మహాకాల్‌కు సమర్పించే ఈ ప్రసాదాన్ని పూర్తి స్వచ్ఛతతో తయారు చేసినట్లు తెలిపారు. చింతామన్, ఉజ్జయిని సమీపంలో ఉన్న ఒక యూనిట్‌లో శనగపిండి లడ్డులను తయారు చేస్తారు. ఈ యూనిట్‌లో ప్రతిరోజు 25 నుంచి 30 క్వింటాళ్ల లడ్డూ ప్రసాదం తయారవుతుండగా, ప్రత్యేక పండుగల్లో దాదాపు 50 నుంచి 60 క్వింటాళ్ల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు.

ఈ యూనిట్‌లో దాదాపు 60 మంది పనిచేస్తున్నారు. ప్రసాదం తయారీలో ఎలాంటి మలినాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రసాదం చేసే ముందు ఉద్యోగులంతా చేతులు కడుక్కోవాలి. వారు తలపై టోపీ ధరిస్తారు. ఆ తర్వాతే ప్రసాదం తయారీ ప్రారంభమవుతుంది. శనగ పిండి కోసం నాణ్యమైన పప్పును కొనుగోలు చేస్తారు. ఈ పప్పును మిల్లులో రుబ్బి శనగపిండిని తయారుచేస్తారు. లడ్డూల తయారీ సమయంలో.. దానికి జోడించిన డ్రై ఫ్రూట్స్ బాగా ఉన్నాయా లేదా అనేది కూడా మొదట ప్రయోగశాలలో టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రసాదంలో కలుపుతారు. శ్రీ మహాకాళేశ్వర్ మేనేజ్‌మెంట్ కమిటీ ప్రకారం.. ఈ ప్రసాదం చాలా స్వచ్ఛమైనది, శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ ఈ ప్రసాదానికి సేఫ్ భోగ్ అవార్డుతో పాటు ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా అందుకుంది.

ధర ఎంత?
బాబా మహాకాళ్‌ దర్శనానికి వచ్చే భక్తులకు వారి సౌకర్యానికి అనుగుణంగా లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. మహాకాళేశ్వరాలయంలో రోజూ 25 నుంచి 30 క్వింటాళ్ల లడ్డూలు వినియోగిస్తారు. సుదూర ప్రాంతాల నుండి బాబా మహాకాళ దర్శనం కోసం వచ్చే భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ నుండి 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, 1 కిలోల ప్యాకెట్లలో ఈ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు. శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ ఈ ప్రసాదాన్ని కిలో రూ.400 ధరకే భక్తులకు అందుబాటులో ఉంచింది.