NTV Telugu Site icon

Udhayanidhi Stalin: ఉపమముఖ్యమంత్రిగా నేడే ఉదయనిధి ప్రమాణస్వీకారం!

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin: తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ముఖ్యమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. రాజ్ భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఉదయనిధి ప్రమాణస్వీకార కార్యక్రమం నేడు (ఆదివారం) జరగనుంది. ఈ పునర్వ్యవస్థీకరణలో మరో ముఖ్యమైన అంశం సెంథిల్ బాలాజీ తిరిగి మంత్రివర్గంలోకి రావడం. బాలాజీకి గతంలో విద్యుత్, ఎక్సైజ్ శాఖలు ఇచ్చారు. మనీలాండరింగ్ ఆరోపణల కారణంగా బాలాజీని కొంతకాలం పాటు మంత్రివర్గం నుంచి తప్పించారు. అయితే ఇప్పుడు మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

Fabulous Four: ‘ఫ్యాబ్ 4’గా బౌలర్లు.. భారత్ నుంచి ఇద్దరు!

గత వారం, ఉదయనిధి స్టాలిన్ తాను ఉప ముఖ్యమంత్రి అవుతాడనే ఊహాగానాలను తోసిపుచ్చారు. అలాంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి మాత్రమే తీసుకుంటారని అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి ఎవరనే దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, నా పేరుతో మీడియా తొందరపడవద్దని అన్నారు. అయితే, ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌ను నియమిస్తున్నట్లు త్వరలో ప్రకటించవచ్చని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి అన్బరసన్ కొద్ది రోజుల క్రితం సూచించారు. ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారని, వారం నుంచి 10 రోజుల్లో ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తుందని అప్పుడు ఆయన చెప్పారు.

Astrology: సెప్టెంబర్ 29, ఆదివారం దినఫలాలు