NTV Telugu Site icon

Uddhav Thackeray: బీజేపీ హిందుత్వం గోమూత్రంపై ఆధారపడింది..

Seva Sena

Seva Sena

Uddhav Thackeray: మహరాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ జిల్లాలోని కంకావలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గోమూత్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హిందుత్వం గోమూత్రంపై ఆధారపడి ఉందని అన్నారు. మన హిందుత్వం సంస్కరణవాదిగా ఉంటుందన్నారు.

Read Also: Mussoorie Accident: లోయలో పడిన కారు.. ఐదుగురు మృతి.. ఒకరికి గాయాలు

సావర్కర్ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడితే శివసేన అధినేత ( ఉద్దవ్ ఠాక్రే)గా మీరేమంటారు’ అని అమిత్ షా అన్నారు. మీరు ‘నకిలీ’ శివసేనను నడుపుతున్నారు.. నిజమైన శివసేన (ముఖ్యమంత్రి) ఏక్‌నాథ్ షిండేతో ఉంది.. అలాగే, బాలాసాహెబ్ (శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే) వారసత్వాన్ని మీరు (ఉద్ధవ్) పొందలేరని ఆయన అన్నారు. మీరు అతనికి కొడుకు కావచ్చు, కానీ అతని వారసత్వం నారాయణ్ రాణే, ఏక్‌నాథ్ షిండే, రాజ్ ఠాక్రేతో కలిసి ఉందని అమిత్ షా అన్నారు. ఇక, కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు. ఈ కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రను ‘లూటీ’ చేస్తోందని ఆరోపించారు. I.N.D.I.A కూటమి అధికారంలోకి రాగానే మహారాష్ట్ర కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేలా చూస్తాను అని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు.