NTV Telugu Site icon

Uddhav Thackeray: కాలారామ్ ఆలయంలో హారతికి రావాలని రాష్ట్రపతికి ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానం..

Uddav

Uddav

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ నెల 22న నాసిక్‌లోని కాలరామ్ ఆలయంలో జరిగే హారతికి హాజరుకావాలని ఠాక్రే లేఖలో రాష్ట్రపతిని ఆహ్వానించారు. రామ మందిర పవిత్రత యావత్ దేశానికి ముఖ్యం.. అందుకే కాలారామ్ ఆలయంలో హారతి నిర్వహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీ రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతికి ఆహ్వానం అందిన తరుణంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ ఆహ్వానాన్ని పంపించారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎక్కడికి వెళతారో చూడాలి.

Read Also: Donald Trump : ట్రంప్ లోపాలు బయటపెట్టిన జర్నలిస్టులు.. లీగల్ ఖర్చులు చెల్లించాలన్న కోర్టు

ఇక, అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనపై ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. రామమందిర నిర్మాణం మా నాన్నగారి కల అని తెలిపారు.. ఈరోజు ఆలయ నిర్మాణం జరుగుతోంది.. ఇది సంతోషకరమైన క్షణం.. అయితే, జీవిత పవిత్రత కోసం, శంకరాచార్యులతో చర్చలు జరపాలని ఆయన అన్నారు. అనంతరం ఈ నెల 22న గోదావరి నది ఒడ్డున హారతి నిర్వహిస్తానని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కాగా రామజన్మ భూమి ఉద్యమం కోసం ‘శివసేన’ సుదీర్ఘ పోరాటం చేసిందన్నారు.

Read Also: India- Maldives: భారత్ తో పెట్టుకోవద్దు.. ఇబ్బంది పడతావ్.. మాల్దీవుల అధ్యక్షుడికి ప్రజలు వార్నింగ్

ఇక, మరోవైపు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు శర వేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌.. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపిచింది. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఛాన్స్ ఉంది. అయితే చాలా మంది నేతలకు ఆహ్వానం ఇప్పటి వరకు పంపించలేదు.. వీరిలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్‌ ఠాక్రే కూడా ఒకరు ఉన్నారు.