Uday Kiran Hit Movies Plans To Re-Release Soon: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. బర్త్ డేల సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఖుషి, ఒక్కడు, సింహాద్రి, జల్సా, పోకిరి, దేశముదురు, తొలిప్రేమ, చెన్నకేశవ రెడ్డి, బిల్లా, 7/G బృందావన్ కాలనీ.. పలు సినిమాలు రీ-రిలీజ్ అయి మంచి వసూళ్లు రాబట్టాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన ఆరెంజ్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఓయ్ చిత్రాలు కూడా ఇప్పుడు మరోసారి రిలీజ్ అయి మంచి విజయాన్ని ఇందుకున్నాయి. దాంతో మరిన్ని సినిమాలను కూడా రిలీజ్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఒకప్పటి లవర్ బాయ్, దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన హిట్ చిత్రాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట.
ఉదయ్ కిరణ్‌ను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమాలు నువ్వు నేను, మనసంతా నువ్వే. చిత్రం తర్వాత వచ్చిన ఈ రెండు మూవీస్.. ఉదయ్ కిరణ్ రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన రెండు చిత్రాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు ఎమోషనల్, హార్ట్ టచింగ్ సినిమాలు త్వరలో రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారట. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.
Also Read: Mohammed Shami: ఆస్పత్రి బెడ్‌పై టీమిండియా పేసర్ మహ్మద్ షమీ!
ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా.. నటనపై ఉన్న ఆసక్తితో ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. చిత్రం సినిమాతో హిట్ అందుకున్న ఉదయ్ కిరణ్.. ఆనతి కాలంలోనే స్టార్ అయ్యారు. నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, కలుసుకోవాలని లాంటి హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయనకు వరుస డిజాస్టర్స్ వచ్చాయి. ఓ వైపు సినిమాలు తగ్గిపోవడం, మరోవైపు వ్యక్తిగత కారణాలతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీ, అభిమానులకు షాక్‌కు గురిచేసింది.