Site icon NTV Telugu

Uber Titanic : బెంగళూరు రోడ్లపై టైటానిక్ నౌక.. ఉబర్ కొత్త ప్రయోగం..!

Uber

Uber

Uber Titanic : గత కొన్ని రోజులుగా వరుణ తుఫాను తాకిడికి బెంగళూరు అతలాకుతలమవుతోంది . లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బెంగళూరులోని రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతలో, ఉబర్ బెంగళూరుకు టైటానిక్ బోట్ వ్యవస్థ గురించి కూడా ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉబర్ ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా టైటానిక్ బోట్ లేఅవుట్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో బెంగళూరులో టాక్సీలకు బదులుగా టైటానిక్ బోట్ వ్యవస్థ ఉందని మీరు చూసి ఉండవచ్చు. ఈ టైటానిక్ సేవ నిమిషానికి కేవలం 149 రూపాయలకే అందుబాటులో ఉంటుందని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ పోస్ట్ ద్వారా బెంగళూరులో ప్రస్తుత పరిస్థితిని ఉబర్ ఎగతాళి చేస్తున్నట్లు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు.

Srinivasan : నేను నెపో కిడ్‌ని మాత్రం అసలు కాను..

ఇదే అంశాన్ని హాస్యంగా తీసుకొని Uber India తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. అందులో ‘‘Uber Boat – Now in Bengaluru’’ అని టైటిల్, దానికి తోడు ఒక టైటానిక్ బోట్‌ను రోడ్డుపై తేలుతున్నట్లు చూపిస్తూ, “కేవలం ₹149కే బోట్ సర్వీస్” అంటూ ప్రచారం చేసింది. నిజంగా ఇది అఫీషియల్ సర్వీసు కాదన్న విషయం తెలిసిందే, కానీ ఈ పోస్ట్ మాత్రం జనాల నోళ్లలో చిరునవ్వులు తీసుకొచ్చింది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో పెట్టిన కొద్దిసేపటిలోనే వందలాదిగా కామెంట్లు వచ్చాయి. ఒక్క నెటిజన్ “మేము సిద్ధంగా ఉన్నాం” అంటూ స్పందిస్తే, ఇంకొకరు “ఇది మంచి ప్రయత్నం, వాతావరణాన్ని మరిచిపోవడానికి సరదాగా ఉంది” అంటూ ప్రశంసించారు. మరొకరు మాత్రం హాస్యంతో విమర్శిస్తూ, ‘‘ఈ టైటానిక్ బోట్ ఎక్కకండి సార్.. చివరికి నీళ్లలో మునిగిపోతారు’’ అని సరదాగా హెచ్చరించారు. ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరికీ చిన్న నవ్వు వచ్చింది గానీ, అది పట్ల మనం లోలోన ఆలోచించాల్సిన అవసరమూ ఉంది. వర్షాలు వస్తాయ్, వరదలు పోతాయ్, కానీ ప్రణాళికలు లేకపోతే.. ప్రతి సంవత్సరం టైటానిక్ ప్రయాణమే జరగాల్సి వస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral: బైక్‌పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!

Exit mobile version