Site icon NTV Telugu

Uber Driver Idea: ఉబెర్ డ్రైవర్ సూపర్ ఐడియా… ఫిదా అవుతున్న ప్యాసింజర్లు

Uber F

Uber F

Uber Driver Idea: చాలా మంది పని చేస్తున్నమంటే చేస్తున్నాం అన్నట్టుగానే ఉంటారు. కానీ కొంత మంది మాత్రం ఏ పని చేసినా కొత్తగా చేయాలి అనుకుంటారు. ఫీల్డ్ ఏదైనా తమ మార్క్ చూపాలి అని తపన పడుతుంటారు. తమ పనిలో కొత్తదనం చూపడానికి అది పెద్ద జాబే కానవసరం లేదు. కొత్తగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటే చాలు. అలాగే కొత్తగా ఆలోచించి తన ప్యాసింజర్లతో పాటు నెటిజన్ల ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు ఓ డ్రైవర్.

ఉబెర్ డ్రైవర్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన ట్యాక్సీలో జర్నీ చేసే వారికి బోర్ కొట్టకుండా ఒక సూపర్ ఐడియాను ఆలోచించాడు ఆ డ్రైవర్. ఇంతకీ అతని ఐడియా ఏంటో తెలుసా? సింపుల్ ఐడియానే అయినా ఆకట్టుకునే విధంగా ఉంది అది. ఒక చిన్న పజిల్‌తో కూడిన వీడియో గేమ్ ను అతను డ్రైవర్ సీటు పక్కన ఉండే సీటు వెనుక ఏర్పాటు చేశాడు. ఒక చిన్న డిజిటల్ తెరను ఏర్పాటు చేసి దానిపై వీడియో గేమ్ ఆడుకునేలా సెటప్ చేశాడు.

Also Read : Cats Vs Snakes Viral Video: పిల్లి వర్సెస్ పాము… గెలిచేదెవరు?

దాంతో ఆ ఉబెర్ క్యాబ్ ఎక్కిన ప్రయాణికులు ఎంచక్కా ఆ వీడియో గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ బోర్ కొట్టకుండా ఎంత దూరమైనా ప్రయాణించి తమ గమ్యాన్ని చేరుతున్నారు. అందరిలా కాకుండా కొద్దిగా వెరైటీగా ఆలోచించిన ఉబెర్ డ్రైవర్ వాలెస్‌ ను ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్ లో షేర్ చేయగా డ్రైవర్ ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్యాసింజర్ల గురించి ఇంతగా ఆలోచించినందుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Exit mobile version