Uber: అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మూడేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. ఉబర్ ట్యాక్సీ ద్వారా 800 మంది అక్రమంగా భారతీయులను అమెరికాకు తీసుకొచ్చారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసులో వ్యక్తికి 45 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. కెనడా సరిహద్దు నుంచి భారత పౌరులను అక్రమంగా అమెరికాలోకి చేర్చేవాడని.. ఇందుకోసం ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి.
Read Also:Rashmika Mandanna : రష్మిక ఆ ఒక్కరోజు ఫ్రెండ్స్ తో ఆ పని చేస్తుందా..?
ఈ వ్యక్తి పేరు రాజిందర్ పాల్ సింగ్. అతను అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసించాడు. మనీ స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో రాజిందర్ పాల్ సింగ్‌కు యుఎస్ జిల్లా కోర్టు మంగళవారం 45 నెలల జైలు శిక్ష విధించింది. స్మగ్లింగ్ రాకెట్‌లో కీలక సభ్యుడిగా ఉన్న రాజిందర్ పాల్ సింగ్ వందలాది మంది భారతీయ పౌరులను కెనడా నుంచి సరిహద్దులు దాటించేందుకు సహకరించాడని అమెరికా న్యాయ శాఖ తన నిర్ణయంలో పేర్కొంది. ఇందుకుగాను అతను పౌరుల నుండి 5లక్షల అమెరికా డాలర్ల కంటే ఎక్కువ ఫీజుగా తీసుకున్నాడు. గత నాలుగేళ్లలో 800 మందికి పైగా భారతీయ పౌరులను ఉత్తర సరిహద్దు, వాషింగ్టన్ గుండా అమెరికాలోకి అక్రమంగా తరలించడంలో రాజిందర్ సింగ్ సహకరించాడని అమెరికా తాత్కాలిక అటార్నీ టెస్సా ఎం. గోర్మన్ తెలిపారు.
Read Also:Health Tips : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తప్పనిసరిగా వీటిని తీసుకోవాలి..!
వారి ఈ చర్య వాషింగ్టన్ భద్రతకు మాత్రమే కాకుండా, భారతదేశం నుండి అమెరికాకు స్మగ్లింగ్‌లో తీసుకువచ్చిన వ్యక్తుల భద్రతకు కూడా ముప్పు అని పేర్కొన్నారు. నిందితులు అమెరికాలో మెరుగైన జీవితం కోసం ఎదురుచూస్తున్న ప్రజల ఆశలను బద్దలు కొట్టారు. రాజిందర్ పాల్ సింగ్‌పై 70వేల అమెరికా డాలర్ల భారీ జరిమానా కూడా విధించారు. జూలై 2018 నుండి, రాజిందర్ సింగ్, అతని సహచరులు కెనడాలోని సీటెల్ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా సరిహద్దును దాటుతున్న వ్యక్తుల కోసం ఉబెర్‌ను ఉపయోగించారు. 2018- 2022 మధ్య నిందితులు వ్యక్తుల అక్రమ రవాణా కోసం 600 ట్రిప్పులు చేశారు. విచారణలో నిందితుడి నివాసం నుండి 45వేల డాలర్లు, కొన్ని నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రాజిందర్ పాల్ సింగ్ కూడా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నాడు.
