UAE vs NZ: అంతర్జాతీయ టీ20ల్లో ఇదే మొదటిసారి.. ఇరు జట్లు తొలి బంతికే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NZ and UAE Teams Lose 1st Wicket on First Ball in 1st T20: పసికూన యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 19 పరుగుల తేడాతో కివీస్ గెలిచింది. 156 పరుగుల లక్ష్య ఛేదనలో యూఏఈ మరో రెండు బంతులు ఉండగానే 136 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ 5 వికెట్లతో చెలరేగాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 25 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ పడగొట్టాడు. సౌథీ దెబ్బకు యూఏఈ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు.
యూఏఈ, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ తమ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయాయి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం బహుశా ఇదే మొదటిసారి. న్యూజిలాండ్ ఓపెనర్ చాడ్ బోస్ ఇన్నింగ్స్ తొలి బంతిలో క్యాచ్ ఔట్ కాగా.. యూఏఈ ఓపెనర్ మహ్మద్ వసీమ్ ఎల్బీ అయ్యాడు. బోస్‌ను జునైద్ సిద్ధిఖీ ఔట్ చేస్తే.. వసీమ్‌ను టిమ్ సౌథీ పెవిలియన్ చేర్చాడు.
Also Read
- Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్...
- రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
- YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
- 144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
Also Read:
ఇక ఈ మ్యాచ్‌లో 18 ఏళ్ల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఆర్యన్ష్ శర్మ యూఏఈ తరఫున అరంగేట్రం చేశాడు. ఆర్యన్ష్ తన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 43 బంతుల్లో 60 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అరంగేట్రం మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా అంతర్జాతీయ టీ20లో హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా ఆర్యన్ష్ నిలిచాడు. ఇక ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. టిమ్ సీఫెర్ట్ (55) సహాయంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆపై ఆర్యన్ష్ శర్మ ఆడుకున్నా యూఏఈ విజయం సాధించలేకపోయింది.
A wicket off the 1st ball in the 1st ever T20 between UAE and New Zealand.
.
.#UAEvNZ pic.twitter.com/5YmoWcLP6F— FanCode (@FanCode) August 17, 2023
And now, New Zealand get a wicket on their first ball! Both teams get wickets in the innings' first delivery! Could well be a T20I record?
.
.#UAEvNZ pic.twitter.com/NGRRo7fnaS— FanCode (@FanCode) August 17, 2023
- Tags
తాజావార్తలు
-
Sceneary Software: ఇన్ టైమ్, లో బడ్జెట్లో సినిమా ప్రాజెక్ట్ పూర్తి కావాలా?.. బెస్ట్ ఆప్షన్ ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ ‘సినరీ’!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!