UAE New Year celebrations: రికార్డు బ్రేకింగ్ సెలబ్రేషన్స్‌తో న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పి ఒక ముస్లిం దేశం వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇంతకీ ఆ దేశం పేరు ఏంటో తెలుసా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE). అబుదాబి నుంచి దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, ఫుజైరా వరకు, ఆకాశం రంగులు, కాంతి, రికార్డులతో వెలిగిపోయింది. UAE 2026ని వేడుకలతోనే కాదు, సరికొత్త చరిత్రను లిఖిస్తూ స్వాగతించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అబుదాబిలోని అల్ వాత్బా ప్రాంతంలో జరిగిన షేక్ జాయెద్ ఉత్సవం యుఎఇలో జరిగిన అతిపెద్ద నూతన సంవత్సర వేడుకలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ వేడుకల్లో గంటకు పైగా జరిగిన బాణసంచా ప్రదర్శన హైలెట్‌గా నిలిచింది. ఒకేసారి ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ల టార్గెట్‌గా అక్కడి అధికారులు విశేషంగా ప్రయత్నించారు. ఈ వేడుకలు రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో 62 నిమిషాల పాటు జరిగిన బాణసంచా ప్రదర్శన ప్రధాన హైలెట్‌గా నిలిచింది.
డ్రోన్లతో సరికొత్త చరిత్ర..
ఈ వేడుకలో ప్రధాన హైలెట్ ప్రపంచంలోనే అతిపెద్ద డ్రోన్ ప్రదర్శన. దాదాపు 6,500 డ్రోన్లు 20 నిమిషాల పాటు ఒకేసారి ఆకాశంలోకి ఎగిరి, నింగిలో తొమ్మిది భారీ కళాత్మక ఆకృతులను సృష్టించాయి. డ్రోన్ షోలు ఇప్పటి వరకు అతిపెద్ద ప్రదర్శనగా భావిస్తున్న ఫీనిక్స్ లాంటి నిర్మాణం కూడా ఉంది. నూతన సంవత్సర వేడుకల్లో దుబాయ్ స్కైలైన్ ఒక కలలా కనిపించింది. 40 కి పైగా ప్రదేశాలలో 48 కి పైగా బాణసంచా ప్రదర్శనలు నిర్వహించారు. బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్, దుబాయ్ ఫ్రేమ్, ఎక్స్‌పో సిటీ, గ్లోబల్ విలేజ్, బ్లూవాటర్, అట్లాంటిస్ ది పామ్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ వంటి దిగ్గజ ప్రదేశాలలో లక్షలాది మంది ప్రజలు ఈ వేడుకలను ఆస్వాదించారు. అదే సమయంలో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌లో భాగంగా, బ్లూవాటర్, JBR బీచ్‌లలో అత్యాధునిక డ్రోన్‌లతో ప్రత్యేక డ్రోన్ ప్రదర్శనను నిర్వహించారు. యుఎఇ నగరం రస్ అల్ ఖైమా కూడా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించింది. అల్ మార్జన్ ద్వీపం నుంచి అల్ హమ్రా ద్వీపం వరకు దాదాపు 6 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ ప్రదర్శనలో 2,300 కంటే ఎక్కువ డ్రోన్లు, లేజర్లు, బాణసంచా వాడకం జరిగిందని సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద బాణసంచా షెల్ అర్ధరాత్రి విడుదలైంది.
READ ALSO: Hyundai: కార్ల ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేటి నుంచి భారీగా పెరగనున్న కార్ల ధరలు..!
