UAE Ambassador: “మోడీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది”.. యూఏఈ రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు..
UAE Ambassador: ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర తరమవుతున్నాయి. మొదట ఈ మూడు దేశాలకే పరిమితమై ఘర్షణలు గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతార్, జోర్డాన్ వంటి దేశాలకు పాకాయి. దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కుదేలైంది. ముఖ్యంగా ఇంధన సరఫరాపై తీవ్రంగా ఎఫెక్ట్ పడింది. ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో యూఏఈ రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ఉన్న దౌత్యపరమైన బలాన్ని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క ఫోన్ చేస్తే చాలు ఈ యుద్ధం ముగిసిపోతుందని.. సమస్యలన్నీ సర్దుమనుగుతాయని వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల్లోని పాలకుల్లో మోడీపై అపారమైన గౌరవం ఉందని వెల్లడించారు. అక్కడి ప్రజలు సైతం ప్రధాని మోడీకి మర్యాద ఇస్తారన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విదేశాల్లో మోడీకి ఉన్న ప్రాధాన్యత, భారత్‌కు ఉన్న గౌరవం గురించి చర్చ మొదలైంది.
Also Read
ఇక మరోవైపు.. గల్ఫ్ దేశాల్లో భారత్‌కు చెందిన అనేక మంది జీవిస్తున్నారు. వ్యాపారాలు, బతుకు దెరువు నిమిత్తం భారత్ నుంచి అక్కడికి వెళ్లారు. యుద్ధ వాతావరణం ముదరడంతో భారత్ అప్రమత్తమైంది. అక్కడున్న భారతీయులపై పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణంపై ప్రధాని మోడీ ఇప్పటికే యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఫోన్లో మాట్లాడారు. యూఏఈపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన మోడీ, ఈ క్లిష్ట సమయంలో భారత్ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ శాంతి, భద్రతలను భారత్ ఎప్పుడూ కాంక్షిస్తుందని పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?