NTV Telugu Site icon

U19 Asia Cup 2024: రాణించిన బౌలర్లు.. సెమీఫైనల్‌లో భారత్ ముందు స్వల్ప లక్ష్యం!

India U19

India U19

అండర్‌-19 ఆసియాకప్‌ 2024లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. చేతన్‌ శర్మ, కిరణ్‌ చొర్మాలే, ఆయుష్‌ మాత్రేలు రాణించడంతో శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్‌ యువ జట్టు ముందు 174 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. లంక బ్యాటర్లలో లక్విన్ అబెయ్‌సింఘే (69; 110 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీ చేయగా.. షారుజన్ షణ్ముగనాథన్ (42; 78 బంతుల్లో 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చేతన్‌ శర్మ 3 వికెట్లు.. కిరణ్‌ చొర్మాలే, ఆయుష్‌ మాత్రే చెరో 2 వికెట్లు పడగొట్టారు.

Also Read: OPPO Find X8 Price: ‘ఒప్పో ఫైండ్‌ ఎక్స్8’ సేల్స్ ఆరంభం.. ప్లిప్‌కార్ట్‌లో 7 వేల తగ్గింపు!

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. భారత బౌలర్ల దెబ్బకు 8 పరుగులకే లంక మూడు వికెట్స్ కోల్పోయింది. ఈ సమయంలో లక్విన్, షరుజన్ జోడీ జట్టును ఆదుకుంది. ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. డిఫెన్స్ ఆడుతూ.. క్రీజులో కుదురుకున్నారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ.. నాలుగో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. సెంచరీ భాగస్వామ్యం అనంతరం షరుజన్ అవుట్ కాగా.. భారత బౌలర్లు చెలరేగి లంక బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చారు. కవిజ గమగే (10), విహాస్ థెవ్మిక (14) రెండంకెల స్కోర్ అందుకున్నారు. బ్రేక్ అనంతరం భారత్ చేధనకు దిగనుంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో పాకిస్థాన్‌ 37 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది.

Show comments