Site icon NTV Telugu

US Diplomats Drive Auto: బుల్లెట్ ప్రూప్ కార్లు వదిలి.. ఆటో నడిపిన ఫారినర్స్ ఇంతలోనే..

Us Diplomats

Us Diplomats

US Diplomats Drive Auto: అతిథి దేవో భవ అన్నది మన సంస్కృతి. మన దేశంలోకి ఎవరైనా పర్యాటకులు వచ్చారంటే వారికి పూర్తి భద్రత కల్పిస్తుంది ప్రభుత్వం. అదే వీఐపీలు వస్తే కట్టుదిట్టమైన భద్రత కల్పించి వారు దేశాన్ని వదిలివెళ్లేంత వరకు కంటికి రెప్పలా చూసుకుంటుంటారు. అదే దౌత్యవేత్తలు వస్తే వారి భద్రత గురించి ప్రభుత్వాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా కేటాయిస్తుంది. వాళ్లు అత్యంత భద్రత మధ్య ఉంటారు. అందుకే మన దేశాన్ని చూసేందుకు విదేశీయులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో నలుగురు అమెరికా మహిళా దౌత్యవేత్తలు వీటన్నింటినీ వదిలేసి సామన్యుల్లా తిరిగారు. తమ బుల్లెట్ ప్రూఫ్ కార్లు వదిలేసి, ఆటోరిక్షాల్లో తిరిగారు. ఏదో ఊరికే సిటీ అంతా తిరగడం కాకుండా, అధికారిక కార్యక్రమాలకు కూడా ఆటోలోనే హాజరయ్యారు. అంతేకాదు.. ఆటోను నడిపింది కూడా వాళ్లే. ఈ విషయంపై దౌత్యవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.

Read Also: Dowry Harassment: వద్దన్నా వదల్లేదు.. కత్తితో గొంతు కోసి చంపి గోనెసంచిలో పెట్టి..

అమెరికాకు చెందిన అన్ ఎల్ మేసన్, రూత్ హోంబర్గ్, షరీస్ జె కిట్టర్‌మ్యాన్, జెన్నిఫర్ బైవాటర్స్ అనే నలుగురు మహిళా దౌత్యవేత్తలు ఢిల్లీలో అధికారిక హోదాలో పని చేస్తున్నారు. వారికి ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా కేటాయించింది. అయితే, ఆ కార్లు వదిలేసి సాధారణ ప్రజల్లా ఆటోలో తిరిగారు. ఢిల్లీ వీధుల్లో ప్రత్యేకంగా కనిపించే పింక్ కలర్ ఆటోతోపాటు, బ్లాక్ కలర్ ఆటోలో నలుగురూ ప్రయాణించారు. ఇవి సాధారణ పర్సనలైజ్డ్ ఆటోలు. వీటిలో బ్లూటూత్ డివైజ్ వంటి సాధారణ ఫీచర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఆటోల్లో వాళ్లు ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇలా సాధారణ పౌరుల్లాగా ఆటోలో తిరిగే అవకాశం రావడంపై వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. దౌత్యవేత్తలు చేయాల్సింది స్థానిక ప్రజలతో సంబంధాలు పెంచుకుంటూ, ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవడమే అని, ఆటోలో తిరగడం ద్వారా తాము చేసింది అదేనని వాళ్లు చెప్పారు.

Exit mobile version