NTV Telugu Site icon

China: చైనాలోని షాన్‌డాంగ్‌లో తుపాన్ విధ్వంసం.. దెబ్బతిన్న 2,820 ఇళ్లు.. అయిదుగురి మృతి

China Typhoon

China Typhoon

చైనాలోని షాన్‌డాంగ్‌లో తుపాను(టోర్నాడో) భారీ విధ్వంసం సృష్టించింది. తూర్పు చైనా ప్రావిన్స్ షాన్‌డాంగ్‌లోని ఒక నగరంలో సుడిగాలి కారణంగా ఐదుగురు మరణించారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం హెగే నగరంలోని డాంగ్మింగ్ మరియు జువాన్‌చెంగ్ కౌంటీలను తుపాను తాకింది. దీని కారణంగా 88 మంది గాయపడ్డారు. చైనా వార్తా సంస్థ ప్రకారం.. వీరిలో ఐదుగురి మృతి చెందారు. తుపాను కారణంగా 2,820 ఇళ్లు, 48 విద్యుత్ సరఫరా లైన్లు, 4,000 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. కమ్యూనికేషన్లు, విద్యుత్, నీటి సరఫరాలు పునరుద్ధరించబడ్డాయి. చైనా దక్షిణ మరియు గ్వాంగ్‌డాంగ్, జియాంగ్సు వంటి తీరప్రాంత ప్రావిన్స్‌లలో సుడిగాలుల ప్రభావం అధికంగా ఉండబోదని చైనా వాతావరణ పరిపాలక సంస్థ నివేదించింది.

READ MORE: Renukaswamy Murder Case: హత్యకు ముందు పీకల దాకా ఆహారం.. రేణుకా స్వామి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన అంశాలు

తీవ్రమైన ఉష్ణప్రసరణ వాతావరణం సుడిగాలికి కారణమైందని డాంగ్మింగ్ కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ బ్యూరో తెలిపింది. స్థానిక ప్రభుత్వం కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అత్యవసర కార్యకలాపాలను ప్రారంభించింది. యూఎస్ తో పోలిస్తే.. సుడిగాలులు చైనాలో తరచుగా సంభవించవు. 1961 నుంచి 50 సంవత్సరాలలో దేశంలో కనీసం 1,772 మంది సుడిగాలి కారణంగా మరణించారని పరిశోధకులు చెప్పారు. ఏప్రిల్‌లో, ఒక సుడిగాలి దక్షిణ నగరమైన గ్వాంగ్‌జౌను తాకింది. ఈ విపత్తులో కనీసం ఐదుగురు మరణించారు.. 33 మంది గాయపడ్డారు.

READ MORE: Sunita Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సతీమణి సునీత కీలక వ్యాఖ్యలు

కాగా.. గత నెలలోనే జులైలో విభిన్న వాతావరణం నెలకొంటుందని చైనా వాతావరణ శాఖ తెలిపింది. చైనాలో అనేక ప్రాంతాల్లో ఇటీవల ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. పలు ప్రావిన్సుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇలా భిన్న వాతావరణ పరిస్థితులతో జులై నెలలో ‘అనేక ప్రకృతి విపత్తులు’ తప్పవని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పౌరులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.