NTV Telugu Site icon

Road Accident: మాదాపూర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగానికి ఇద్దరు యువకులు బలి..

Road Accident

Road Accident

అతి వేగానికి ఇద్దరు యువకులు బలయ్యారు. మాదాపూర్ పరిధిలో బైక్ అదుపుతప్పి డివైడర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో బుల్లెట్ బైక్‌పై వేగంగా ఇచ్చిన ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు హాస్పిటల్ తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. మృతులు బోరబండకి చెందిన రఘుబాబు, ఆకాన్ష్ గా గుర్తించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

READ MORE: US-India: అమెరికా వీసాల్లో రికార్డ్.. వరుసగా రెండో ఏడాది 10 లక్షలు జారీ

ఇదిలా ఉండగా.. వేగం కన్న.. ప్రాణం మిన్న.. అతివేగం ప్రాణానికే ప్రమాదకరం.. ఇలాంటి సూచనలు ఎన్ని పెట్టినా, పోలీసులు, రవాణాశాఖ ఎన్ని తనిఖీలు చేపట్టినా వాహనదారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని చూస్తున్న పోలీసులకు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, రాంగ్‌రూట్‌, నిర్లక్ష్య తలనొప్పిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ నిండు ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు తీరని దుఃఖం మిగులుస్తున్నారు. ఇటీవల సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, రాంగ్‌రూట్‌, నిర్లక్ష్య , డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్‌ లేకుండా వాహనాలపై దూసుకెళ్లడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా యువకులే ఉంటున్నారు. తల్లిదండ్రులు మీ పిల్లలకు వాహనాలు కొనిచ్చే ముందు జాగ్రత్తలు చెప్పండి.. తాగి నడపొద్దని హితబోధ చేయండి..

READ MORE: Jio Plans Change: గుర్తుంచుకోండి జియో వినియోగదారులారా.. ఆ ప్లాన్స్ వాలిడిటీని మార్చేసిందిగా

Show comments