Site icon NTV Telugu

Tragedy: విషాదం.. నీటి తొట్టెలో పడి రెండేళ్ల బాలుడు మృతి

Boy

Boy

Tragedy: అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడి ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. ఇంటి అవసరాల కోసం తవ్విన నీటితొట్టె బాలుడి పాలిట యమపాశంగా మారింది. తమ కుమారుడు మృతిచెందటం వల్ల దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన కేదార్‌దాస్ దంపతులు తాపీ పని చేసేందుకు సత్తుపల్లికి వచ్చారు. తాపీ పని చేస్తున్న ఇంటి ఆవరణలో కేదార్ దాస్ రెండేళ్ల కుమారుడు సాయి నీటి తొట్టెలో పడి మృతిచెందాడు. సాయి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. చివరకు నీటి తొట్టెలో చూడగా మృతదేహమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదన చూసి అక్కడి వారి కన్నీరు పెట్టుకున్నారు.

Read Also: TV Anchor: తీర్థంలో మత్తుమందిచ్చి రేప్.. పూజారిపై టీవీ యాంకర్ కేసు

Exit mobile version