NTV Telugu Site icon

Fridge Explodes: ఉమెన్స్‌ హాస్టల్‌లో పేలిన ఫ్రిడ్జ్‌.. ఇద్దరు యువతులు మృతి!

Fire Accident

Fire Accident

Fridge Explodes in Women’s Hostel in Madurai: తమిళనాడులోని మదురైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మదురై జిల్లా కాట్రంపళయం ప్రాంతంలోని విసాక ప్రైవేట్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఈరోజు తెల్లవారుజాము 4:30 గంటల సమయంలో ఫ్రిడ్జ్‌ పేలింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రిఫ్రిజిరేటర్ దగ్గర నిద్రిస్తున్న ఇద్దరు యువతులు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Also Read: Duleep Trophy 2024: నేటి నుంచే రెండో రౌండ్‌.. అందరి దృష్టి శ్రేయస్‌పైనే!

దట్టమైన పొగ, భారీగా మంటలు ఎగిసిపడటంతో విసాక ప్రైవేట్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లోని కొందరు యువతులు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. హాస్టల్‌లో ఉంటున్న పరిమళ, శరణ్యలు మృతి చెందినట్లు సమాచారం. వీరికి గాయాలు అవ్వడమే కాక.. పొగతో ఊపిరాడక చనిపోయారు. భారీ పొగ కారణంగా మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 20 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మాటలను ఆర్పి.. మహిళలను రక్షించారు. ఘటనా సమయంలో హాస్టల్‌లో 40 మందికి పైగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫ్రిడ్జ్‌ పేలిఉంటుందని పోలీసులు తెలిపారు.

Show comments