NTV Telugu Site icon

Road Accident: మార్నింగ్ వాకింగ్కు వెళ్లి.. అనంత లోకాలకు

Accident

Accident

మృత్యువు ఏ రూపంలో వచ్చి బలి తీసుకుంటుందో తెలియదు. మార్నింగ్ వాకింగ్ కు అని వెళ్లిన ఇద్దరు మహిళలు.. అనంత లోకాలకు వెళ్లిపోయారు. రోడ్డుపైనే నడుచుకుంటు వెళ్తుండగా.. స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Kids Care : పిల్లలకు వీటిని అస్సలు ఇవ్వకూడదు .. ఎందుకో తెలుసా?

వివరాల్లోకి వెళ్తే.. రీసాలా బజార్ కు చెందిన రాధిక (48) బొల్లారం కలాసిగూడ సాయి కాలనీకీ చెందిన పొలం బాలమని యాదవ్ (60) లు వీరిద్దరు మంచి స్నేహితులు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు బొల్లారంలోని కంటోన్మెంట్ బోర్డు పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో వాకింగ్ కు బయలుదేరారు. కొద్దిసేపట్లోనే కంటోన్మెంట్ బోర్డు పార్క్ లోపలికి చేరుకొనే క్రమంలో ఉప్పల్ కు చెందిన ఆదిత్య.. కావాసకి స్పోర్ట్స్ బైక్ తో వారిద్దరిని ఢీకొట్టాడు.

Andhra Pradesh: తల్లి ప్రేమంటే ఇదే.. వరదలో చిక్కుకున్న తన పిల్లల కోసం తల్లి కుక్క ఏం చేసిందంటే..!

వారికి బలమైన గాయాలు కావడంతో రాధిక అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళ బాలమని యాదవ్ ను 108అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. బైకర్ రేసింగ్ కోసం శామీర్ పేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.