NTV Telugu Site icon

Challan: ఇదేమీ విడ్డూరం.. సీట్‌బెల్ట్‌ ధరించలేదని టూ వీలర్ యజమానికి రూ.1000 జరిమానా!

Traffic Challan

Traffic Challan

2-Wheeler Owner In Bihar Receives Challan Of Rs 1,000 For Not Wearing Seatbelt: సాధారణంగా ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాను విధిస్తూ ఉంటారు. బీహార్‌లో ఓ ద్విచక్ర వాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోనందుకు విచిత్రమైన ట్రాఫిక్ చలాన్ అందుకున్నాడు. 2020లో ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా సమతిపూర్‌లో ఈ సంఘటన జరిగిందని, ఇప్పటికే చలాన్‌ జమ అయినట్లు తెలిసిందని వాహనదారుడు కృష్ణకుమార్‌ ఝా తెలిపారు. 2020లోని చలానా మెసేజ్‌ ఇప్పుడు వచ్చినట్లు ఆయన తెలిపారు. అది కూడా సీట్‌ బెల్ట్ ధరించలేదని వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

“నా దగ్గర స్కూటీ ఉంది. ఏప్రిల్ 27న నేను బెనారస్ (వారణాసి) వెళుతున్నాను. నేను రైలులో ఉన్నప్పుడు, నా పేరుపై రూ.1,000 చలాన్ జారీ చేయబడిందని నాకు మెసేజ్ వచ్చింది. నేను వివరాలను చూసినప్పుడు. 2020 అక్టోబర్‌లో సీట్‌బెల్ట్ ధరించనందుకు అని అందులో పేర్కొన్నారు” అని వాహనదారుడు వెల్లడించాడు. టూ వీలర్‌ నడిపితే సీట్‌బెల్ట్‌ చలానా రావడంతో అతను ఆశ్చర్యపోయాడు. అనంతరం ట్రాఫిక్‌ విభాగాన్ని సంప్రదించగా.. ఏదో ఒక లోపం కారణంగా చలాన్ రూపొందించబడి ఉండవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.”కృష్ణకుమార్‌ ఝా అందుకున్న చలాన్ మాన్యువల్‌గా జారీ చేయబడింది. ఇప్పుడు వీటన్నింటినీ ఈ-చలాన్‌లుగా కవర్ చేసే ప్రక్రియలో ఉన్నాము. లోపం ఎక్కడ జరిగిందో నేను తనిఖీ చేస్తాను” అని బీహార్ ట్రాఫిక్ పోలీసు అధికారి బల్బీర్ దాస్ చెప్పారు.

Read Also: Doctors On Strike: నిరవధిక సమ్మెకు దిగిన ప్రభుత్వ వైద్యులు.. కారణమేంటంటే?

ఫిబ్రవరిలో ఒడిశాలో ఇదే విధమైన సంఘటన నివేదించబడింది. అభిషేక్ కర్‌కు తన ద్విచక్రవాహనం నడుపుతున్నప్పుడు సీటుబెల్ట్ ధరించలేదని రూ. 1,000 జరిమానా విధించారు.రాజ్‌గంగ్‌పూర్ నివాసి అయిన అభిషేక్ మాట్లాడుతూ.. ఇ-చలాన్‌లో ఉన్న ఫోటో మరొకరిదని తనకు తర్వాత తెలిసిందన్నారు. లోపం గురించి వారిని అప్రమత్తం చేయడానికి అతను స్థానిక రవాణా అధికారులను, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది.