Teachers: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో వాగు దాటుతుండగా ఇద్దరు టీచర్లు ప్రమాదవశాత్తు చనిపోయారు. అయితే ఈ విషయంలో స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ఇద్దరి మరణం బాధ కలిగించిందని మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందించామని ఆమె వెల్లడించారు. అలాగే రెండు కుటుంబాల్లో వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
Read Also: Amaravati: రాజధాని పరిధిలో కొనసాగుతోన్న జంగిల్ క్లియరెన్స్
అదేవిధంగా కేంద్రం నుంచి రూ. 10 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి సాయం అడిగినా ఇమ్మని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి తెలిపారు. నిన్న అనకాపల్లిలో జరిగిన హాస్టల్ సంఘటనలో కలుషితాహారం తిని ముగ్గురు చనిపోయారు. గుర్తింపు లేని హాస్టళ్లు నడిపే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు.