Planes Collide: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాలు ఢీ.. ప్రయాణికులు సురక్షితం.!

Planes Collide

Planes Collide

Planes Collide: ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో రెండు ప్రయాణికుల విమానాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ సంస్థలకు చెందిన విమానాలు రన్‌వేపై టాక్సీయింగ్ (టేకాఫ్ కి ముందు లేదా ల్యాండింగ్ అయిన తర్వాత) సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇది చిన్న ప్రమాదంగా అధికారులు పేర్కొన్నారు.

TCS: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీసీఎస్..

అందిన సమాచారం ప్రకారం.. టాక్సీయింగ్ సమయంలో Boeing 737-700 కు చెందిన స్పైస్‌జెట్ విమానం, అకాసా ఎయిర్ విమానాన్ని తాకింది. ఈ ఘటనలో స్పైస్‌ జెట్ విమానం కుడి వైపు వింగ్‌లెట్ దెబ్బతినగా, అకాసా విమానం ఎడమ వైపు హారిజాంటల్ స్టెబిలైజర్‌ కు నష్టం వాటిల్లింది.

ఈ ఘటనపై అకాసా ఎయిర్ స్పందిస్తూ.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాల్సిన QP 1406 విమానం ఆ సమయంలో నిలిచి ఉంది. మరో ఎయిర్‌లైన్ విమానం వచ్చి ఢీకొట్టిందని సంస్థ తెలిపింది. ఘటన అనంతరం విమానాన్ని తిరిగి బే వద్దకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు దించారు. హైదరాబాద్‌ కు వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అకాసా ఎయిర్ వెల్లడించింది. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది.

No Rain-No Gain: వానలు పడితే స్టాక్ మార్కెట్ పరుగులు.. వర్షానికి, స్టాక్ మార్కెట్‌కు సంబంధం ఏంటి..?

ఇక మరోవైపు స్పైస్‌ జెట్ సంస్థ స్పందిస్తూ.. ఈ ఘటనను ధృవీకరిస్తూ.. టాక్సీయింగ్ సమయంలో గ్రౌండ్ మూవ్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. తమ విమానం సేవల నుంచి తాత్కాలికంగా తప్పించబడిందని (గ్రౌండెడ్) వెల్లడించింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నారు.